
సాక్షి, పల్నాడు జిల్లా: దాచేపల్లి ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో దారుణం జరిగింది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థి అఖిల్‌ను సీనియర్లు చితకబాదారు. కర్రతో కొడుతూ.. కాళ్లతో తన్నుతూ.. విచక్షణారహితంగా దాడి చేశారు. కరెంట్ వైర్‌తో షాక్ ఇచ్చేందుకు సీనియర్లు యత్నించారు.

దాడి దృశ్యాలను వీడియో చిత్రీకరించారు. తమ కుమారుడిని చిత్రహింసలకు గురి చేశారంటూ అఖిల్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అఖిల్ దాడి ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన 7వ తేదీన జరిగింది.
