తిరుమలలో భక్తుల ఆందోళన | TTD Devotees Fires on BR Naidu: AP | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల ఆందోళన

Mar 14 2026 6:13 AM | Updated on Mar 14 2026 6:14 AM

TTD Devotees Fires on BR Naidu: AP

టీటీడీ చైర్మన్‌కు వ్యతిరేకంగా నినాదాలు 

తిరుమల: దర్శనానికి గంటల తరబడి వేచి ఉన్నా.. ప్రాథమిక సదుపాయాలు కూడా కల్పించలేదంటూ తిరుమలలో భక్తులు శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చి నారాయణగిరి షెడ్లలో గంటల తరబడి వేచి ఉన్న తమకు కనీస సదుపాయాలు కూడా కల్పించలేదంటూ నిరసన తెలిపారు. కొందరు భక్తులు టీటీడీ చైర్మన్‌ బి.ఆర్‌.నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షెడ్లలో రద్దీ పెరిగిపోయినా తాగునీరు, విశ్రాంతి, పరిశుభ్రత, గాలి ప్రసరణ వంటి ప్రాథమిక సదుపాయాలు కూడా తగినంతగా కల్పించలేదని చెప్పారు.

వృద్ధులు, పిల్లల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. ఈ ఇబ్బందుల నేపథ్యంలో పలువురు భక్తులు టీటీడీ చైర్మన్‌ బి.ఆర్‌.నాయుడు డౌన్‌డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. దర్శన నిర్వహణలో లోపాలు, షెడ్లలో అవ్యవస్థ పరిస్థితులపై నినదించారు. భక్తుల నినాదాలతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  

సోషల్‌ మీడియాలో వైరల్‌: భక్తులు నినాదాలు చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై భక్తులు, నెటిజన్లు స్పందిస్తూ.. తిరుమలలో భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement