విద్యుదాఘాతంతో యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

Mar 14 2026 7:53 AM | Updated on Mar 14 2026 7:53 AM

విద్యుదాఘాతంతో యువకుడి మృతి సమాచార హక్కు చట్టం అమలుకు సహకరించాలి ఉత్సాహంగా కొనసాగిన స్పోర్ట్స్‌ మీట్‌

మంగళగిరి టౌన్‌ : విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందిన ఘటన మంగళగిరి పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం... తుళ్ళూరు మండలం మందడం గ్రామానికి చెందిన ఉయ్యాల చందు (27) మంగళగిరి మండలం ఆత్మకూరులోని వాటర్‌ ప్లాంట్‌లో పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే శుక్రవారం ఉదయం పని నిమిత్తం ఆత్మకూరు వాటర్‌ ప్లాంట్‌కు చేరుకున్నాడు. అక్కడి నుంచి వాటర్‌ ట్యాంక్‌ ఉన్న ఆటోతో మంగళగిరి పట్టణం టిప్పర్ల బజార్‌లో నారాయణ స్కూల్‌కు చేరుకున్నాడు. అక్కడి వాటర్‌ ట్యాంక్‌లోకి ఆటోలోని ట్యాంక్‌ నుంచి పైపు ద్వారా నీరు నింపుతున్నాడు. విద్యుత్‌ వైర్లు, వాటర్‌ ట్యూబ్స్‌ ఎర్త్‌ కావడంతో ఆటోలో కూర్చుని ఉన్న చందుకు విద్యుదాఘాతం తగిలింది. సిబ్బంది అతడిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చందు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మంగళగిరి టౌన్‌: సమాచార హక్కు చట్టాన్ని మరింత సమర్థంగా అమలు చేయడంలో ప్రభుత్వ సహకారం కూడా ఎంతో అవసరమని పంజాబ్‌ రాష్ట్ర చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌ (సీఐసీ) ఇంద్రపాల్‌ సింగ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని రాష్ట్ర సమాచార కమిషనర్‌ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్‌ పి.ఎస్‌. నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇంద్రపాల్‌ సింగ్‌ మాట్లాడుతూ పంజాబ్‌ సమాచార హక్కు కమిషన్‌ పనితీరు, సెకండ్‌ అప్పీల్‌ కేసులను ఎలా డిస్పోజ్‌ చేస్తున్నారో వివరించారు. అనంతరం ఇంద్రపాల్‌ సింగ్‌ను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్‌ చావలి సునీల్‌ పాల్గొన్నారు.

నెహ్రూనగర్‌: ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యోగుల స్పోర్ట్స్‌ మీట్‌ రెండో రోజు కూడా కొనసాగింది. పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లో జరుగుతున్న ఈ మీట్‌లో డిప్యూటీ కమిషనర్‌ డాక్టర్‌ కె. శ్రీనివాసులు శుక్రవారం క్రికెట్‌, ఇతర పోటీలను టాస్‌ వేసి ప్రారంభించారు. మహిళలకు కబడ్డీ, త్రోబాల్‌, స్కిప్పింగ్‌, 100 మీటర్స్‌ వాకింగ్‌, టెన్నికాయిట్‌ డబుల్స్‌, చెస్‌, క్యారమ్స్‌ వంటి పోటీలు జరిగాయి. స్పోర్ట్స్‌ మీట్‌ శనివారంతో ముగుస్తుందని డీసీ శ్రీనివాసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement