ఖబరస్తాన్‌ మీదుగా వంతెన నిర్మాణం తగదు | - | Sakshi
Sakshi News home page

ఖబరస్తాన్‌ మీదుగా వంతెన నిర్మాణం తగదు

Mar 14 2026 7:53 AM | Updated on Mar 14 2026 7:53 AM

ఖబరస్తాన్‌ మీదుగా వంతెన నిర్మాణం తగదు గ్యాస్‌ బుకింగ్‌ పేరుతో సైబర్‌ మోసాలు

శైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామి

మంగళగిరి టౌన్‌ : మంగళగిరి–తెనాలి రోడ్డులో ఖబరస్తాన్‌పై బ్రిడ్జి నిర్మాణ ప్రతిపాదన శ్రేయస్కరం కాదని శైవ క్షేత్రం పీఠాధిపతి శివస్వామి అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలోని తాళ్ళాయపాలెంలో శుక్రవారం శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మంగళగిరి పట్టణంలోని తెనాలి రోడ్డు విస్తరణ అంశంపై స్పందించిన ఆయన హిందూ సంప్రదాయం దృష్ట్యా ఇలాంటి నిర్మాణాలపై రాకపోకలు అనుకూలంగా ఉండవని పేర్కొన్నారు. తెనాలి రోడ్డు విస్తరణపై ప్రజలు, మత పెద్దల నుంచి విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయని తెలిపారు. వీటిని గౌరవంగా పరిగణనలోకి తీసుకుని మంత్రి నారా లోకేష్‌ పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు.

నగరంపాలెం: గ్యాస్‌ బుకింగ్‌ పేరుతో జరిగే సరికొత్త సైబర్‌ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వంట గ్యాస్‌ సిలిండర్ల కొరత ఉందనే అపోహలను సైబర్‌ నేరగాళ్లు అనుకూలంగా మార్చుకుని, అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం ఆన్‌లైననులో గ్యాస్‌ బుకింగ్‌కి వెతికే వారిని లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. తక్షణమే సిలిండర్‌ డెలివరీ చేస్తామని, అదనంగా కేటాయిస్తామని సామాజిక మాధ్యమాల్లో నకిలీ ప్రకటనలతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారని చెప్పారు. వాట్సాప్‌, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా నకిలీ వెబ్‌సైట్‌ లింకులు పంపిస్తూ ముందుగా డబ్బులు చెల్లిస్తే వెంటనే గ్యాస్‌ సరఫరా చేస్తామని నమ్మబలికే ప్రయత్నాలు చేస్తున్నారని వివరించారు. అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్‌ చేయవద్దని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement