చేబ్రోలు: పరిశోధనలకు విద్యాసంస్థలు, పరిశ్రమలు కలిసి పనిచేసినప్పుడే నూతన ఆవిష్కరణలు సాధ్యమవుతాయని హైదరాబాద్‌లోని జీనోమిక్స్ మాలిక్యులర్ డయాగ్నస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రెసిడెంట్, సీఈవో డాక్టర్ రత్నగిరి పోలవరపు తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ‘‘ప్లాంట్ సైన్స్ కొలోక్వియమ్’’ అంశంపై రెండు రోజుల జాతీయస్థాయి కాన్ఫరెన్స్‌ను శుక్రవారం ప్రారంభించారు. సావనీర్‌ను ఆవిష్కరించారు. ‘‘బయోటెక్నాలజికల్ ప్రొడక్షన్ ఆఫ్ బయోయాక్టివ్ ఫైటో కెమికల్స్ ఆఫ్ మెడిసినల్ వ్యాల్యూ’’ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. జీనోమిక్స్, విజ్ఞాన్ వర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కన్సార్టియం సెంటర్ ఫర్ అడ్వాన్డ్‌స్ జీనోమిక్స్ రీసెర్చ్‌ను విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య ప్రారంభించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ రత్నగిరి పోలవరపు మాట్లాడుతూ బయోటెక్నాలజీ, ప్లాంట్ సైన్స్ రంగాల్లో జరుగుతున్న పరిశోధనలు వైద్యరంగం, ఔషధ తయారీ, వ్యవసాయ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. జబల్‌పూర్‌లోని మంగళయాతన్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కేఆర్‌ఎస్ సాంబశివరావు మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయంలో కృత్రిమ మేధస్సు కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ విభాగం ప్రొఫెసర్ కేపీఎంఎస్‌వీ పద్మశ్రీ , వివిధ విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, అధ్యాపకులు పాల్గొన్నారు. తాజా అంశాలపై పరిశోధనా పత్రాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో మైసూరులోని సీఎస్‌ఐఆర్–సీఎఫ్‌టీఆర్‌ఐ ప్లాంట్ సెల్ బయోటెక్నాలజీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఆర్‌వీ శ్రీధర్, మేక జగన్‌మోహన్‌రావు, విజ్ఞాన్ సంస్థల వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, సీఈవో మేఘన కూరపాటి, ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్ కేవీ కృష్ణకిషోర్, డీన్లు పాల్గొన్నారు.
‘జీనోమిక్స్ మాలిక్యులర్ డయాగ్నస్టిక్స్’ ప్రెసిడెంట్, సీఈవో


