ఒకే అంబులెన్స్‌.. డజను మంది రోగులు! | Healthcare Crisis In Alluri Sitarama Raju District 12 Patients In One Ambulance, More Details Inside | Sakshi
Sakshi News home page

ఒకే అంబులెన్స్‌.. డజను మంది రోగులు!

Mar 14 2026 8:30 AM | Updated on Mar 14 2026 10:18 AM

Healthcare crisis in alluri sitarama raju district 12 patients in one ambulance

డుంబ్రిగుడ (అల్లూరి సీతారామరాజు జిల్లా): అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిపుత్రులకు వైద్యం దైవాదీనంగా మారింది. జిల్లా కేంద్రమైన పాడేరు ఆస్పత్రిలో సైతం సరిపడా అంబులెన్స్‌లు లేవు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం శుక్రవారం పాడేరు జిల్లా ఆస్పత్రి నుంచి ఒకే అంబులెన్స్‌లో 12 మంది రోగులను విశాఖ కేజీహెచ్‌కు తరలించడమే. గర్భిణులు ఉన్న అంబులెన్స్‌లో కనీసం నర్సు లేరని.. మార్గమధ్యంలో ప్రసవం జరిగితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. 

డుంబ్రిగుడ మండలం గసబ పంచాయతీ గసబ గ్రామానికి చెందిన పాంగి చిన్ని ప్రసవం నిమిత్తం అరకువేలీ సీహెచ్‌సీలో మూడు రోజుల కిందట చేరింది. అక్కడి నుంచి పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించగా.. సరిపడా రక్తం లేదని కేజీహెచ్‌కు రిఫర్‌ చేశారు. ఆమెతో పాటు ఒకే అంబులెన్సులో 12 మందిని తరలించడం.. ఏజెన్సీలో ప్రజల కష్టాలకు అద్దంపడుతోంది.   

 

Advertisement
 
Advertisement
Advertisement