‘వెన్నుపోటు దినం’ సక్సెస్‌పై వైఎస్ జగన్ ట్వీట్ | Ys Jagan Tweet On The Success Of Vennupotu Dinam | Sakshi
Sakshi News home page

‘వెన్నుపోటు దినం’ సక్సెస్‌పై వైఎస్ జగన్ ట్వీట్

Jun 4 2025 6:18 PM | Updated on Jun 4 2025 6:53 PM

Ys Jagan Tweet On The Success Of Vennupotu Dinam

సాక్షి, తాడేపల్లి: ‘వెన్నుపోటు దినం’ సక్సెస్‌పై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘‘సంవత్సరం క్రితం చంద్రబాబు అధికారంలోకి వచ్చారు.. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కానీ, హామీని కానీ అమలు చేయలేదు. తనను నమ్మిన రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ద్రోహం చేశారు’’ అంటూ వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా నిలదీశారు.

‘‘ఎన్నో హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచారు. అందుకే ఈరోజు వెన్నుపోటు దినం కార్యక్రమానికి పిలుపునిచ్చాం. అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ తీవ్ర ఆవేదన, కోపాన్ని వ్యక్తం చేశారు. ఇది కేవలం నిరసన మాత్రమే కాదు.. మోసం చేస్తే మౌనంగా ఉండరనే శక్తివంతమైన సందేశాన్ని ప్రజలు ప్రభుత్వానికి ఇచ్చారు.

..బాధిత ప్రజలతో కలిసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీలోని ప్రతి నాయకుడు, కార్యకర్త, ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రజల న్యాయబద్దమైన హక్కుల సాధన కోసం వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుంది’’ అని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement