
సాక్షి, తాడేపల్లి: నేడు(అగస్టు 9న) అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రకృతి ఒడిలో నివసించే కల్మషం లేని మనుషులు ఆదివాసీలు. ప్రాచీన చరిత్రకు, సంస్కృతికి నిలువుటద్దం వారు. నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నా ఆదివాసి సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు అంటూ తన ఎక్స్ ఖాతాలో ఆయన ఓ సందేశం ఉంచారు.
ప్రకృతి ఒడిలో నివసించే కల్మషం లేని మనుషులు ఆదివాసీలు. ప్రాచీన చరిత్రకు, సంస్కృతికి నిలువుటద్దం వారు. నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నా ఆదివాసి సోదర సోదరీమణులందరికీ శుభాకాంక్షలు.#WorldTribalDay
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 9, 2025
ఆదివాసీ ప్రజల హక్కులు, వారిపట్ల గౌరవం, మరియు వారి సంస్కృతిని పరిరక్షించేందుకు.. ఆగస్టు 9వ తేదీని అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంగా 1994లో ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.
