బాబు పాలన చూస్తుంటే మా కడుపు తరుక్కుపోతుంది : ఎన్‌ఆర్‌ఐలు | NRI Fires On Chandrababu | Sakshi
Sakshi News home page

బాబు పాలనలో రాష్ట్ర ప్రజల బాధలు చూస్తుంటే మా కడుపు తరుక్కుపోతుంది : ఎన్‌ఆర్‌ఐలు

Jun 3 2025 10:35 AM | Updated on Jun 3 2025 10:41 AM

NRI Fires On Chandrababu

సిడ్నీ: ఏపీలో కొనసాగుతున్న రాక్షస పాలనతో ప్రజలు పడుతున్న బాధలను చూస్తుంటే తమ కడుపు తరుక్కుపోతుందని ఆస్ట్రేలియా ఎన్నారైలు తెలిపారు. రాష్ట్ర  ప్రజల  జీవితాలను చూసి చలించిపోతున్నామన్న ఎన్‌ఆర్‌ఐలు.. మరో నాలుగేళ్లు ఈ రాక్షస పాలనలో బాధలు పడడం వారి దురదృష్టమని అన్నారు. 

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా డైవర్షన్ రాజకీయాలతో కూటమి నేతలు కాలయాపన చేస్తున్నారని ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ కూడా సాధించలేదని వారు తెలిపారు.  వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి, వీరం రెడ్డి శ్రీధర్ రెడ్డి , హరి ఎడనపర్తి, దూడల లోక కిరణ్ రెడ్డి, కృష్ణ చైతన్య కామరాజు, బుర్ర ముక్కు రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Advertisement
 
Advertisement
Advertisement