అప్పుడు.. మళ్లీ ఇప్పుడు.. అధికారం కోసమే బాబు వెన్నుపోటు: పెద్దిరెడ్డి | YSRCP Vennnupotu Protests: Peddireddy Slams Chandrababu Over AP Debts In Kutami Govt And Super Six | Sakshi
Sakshi News home page

అప్పుడు.. మళ్లీ ఇప్పుడు.. అధికారం కోసమే బాబు వెన్నుపోటు: పెద్దిరెడ్డి

Jun 4 2025 1:09 PM | Updated on Jun 4 2025 1:30 PM

YSRCP Vennnupotu Protests: Peddireddy Slams Chandrababu

సాక్షి, చిత్తూరు జిల్లా: ఏడాది కాలంలో చేసిన అప్పులకు చంద్రబాబులో జవాబుదారితనం లేదని.. కానీ, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పుంగనూరులో ఆయన ఆధ్వర్యంలో వెన్నుపోటు నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. తహసీల్దార్‌కు వినతిపత్రం అందించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం నిరసన ర్యాలీల్లో పాల్గొంటున్నారు. దీనిని బట్టే ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అర్థమవుతోంది. అప్పుడు చంద్రబాబు అధికారంకోసం ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు మళ్లీ అధికారం కోసం ఉచిత హామీలు పేరుతో  ఏడాది కాలంగా ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. 

సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు గాలికి వదిలేశారు. ఏడాది కాలంలో సీఎం చంద్రబాబు నాయుడు తెచ్చిన లక్షా 51వేల కోట్ల రూపాయాల అప్పులకు జవాబు చెప్పే పరిస్థితిలో ఆయన లేరు. కానీ, ప్రజలకు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరోవైపు కాగ్ కూడా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని తెలిపింది. 

.. రాష్ట్రంలో పాలన గాడి తప్పింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,మంత్రి లోకేష్ విలాసాలకు హెలికాప్టర్లను, విమానాలను కొనుగోలు చేశారు. సాయంత్రం కాగానే  హైదరాబాద్‌కు, పగలు అమరావతికి తిరుగుతున్నారు. సెకీతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం యూనిట్ కు సోలార్ ఎనర్జీ 2.49 పైసలు ఒప్పందం చేసుకుంటే పెద్ద రాద్దాంతం చేసిన ఎల్లో మీడియా.. ఇవాళే చంద్రబాబు సర్కారుకు యూనిట్ కు 4.60 పైసల కు కొనుగోలుకు ఒప్పందం చేసుకుని 11వేల కోట్లు అవినీతికి పాల్పడింది. ఏడాది కాలంలో ఎన్నికోట్లు ఉచిత గ్యాస్ కు ఖర్చు చేశారో వివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది’’ అని పెద్దిరెడ్డి అన్నారు. 

రాష్ట్రంలో రైతులు పరిస్థితి దయనీయంగా మారింది. సీఎం సొంత జిల్లాలో మామిడి రైతులు సరైన ధర లేక పొలాల్లో మామిడి పంట విడిచి పెట్టేశారు. పొగాకు, మిర్చి , టమోటో రైతులుది ఇదే పరిస్థితి. 

రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకుల్ని టార్గెట్ చేసుకుని అక్రమ అరెస్టులు చేస్తున్నారు. పార్టీకి చెందిన దళిత నేతలు ను తప్పుడు కేసులతో అరెస్ట్ చేయిస్తున్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చి 26 లక్షలు మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తే ఎంతో సక్రమంగా ఫలితాలు పారదర్శకంగా ప్రకటించారు. కానీ, ఇవాళ పదో తరగతి పరీక్షలు ఫలితాలు తప్పడు తడకగా ప్రకటించి విద్యార్ధులు జీవితాలతో ఆటలు ఆడుతున్నారు. గతంలో ఇదే టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ హయంలో పదో తరగతి పరీక్షలు ఫలితాల్లో తప్పిదాలు జరిగితే.. నాటి మంత్రి గాలి ముద్దు కృష్ణమ నాయుడితో రాజీనామా చేయించారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు పదో తరగతి తప్పుడు ఫలితాలు పై కొడుకు  మంత్రి లోకేష్ పదవికి రాజీనామా చేయించాలి అని పెద్దిరెడ్డి డిమాండ్‌ చేశారు. వెన్నుపోటు దినం నిరసనల్లో అనీషా రెడ్డి, పార్టీ కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement