
సాక్షి,నగరి: ఇచ్చిన హామీల్ని నెరవేర్చకపోతే కూటమి ప్రభుత్వాన్ని రోడ్డుకీడుస్తామని మాజీ మంత్రి ఆర్కే రోజా హెచ్చరికలు జారీ చేశారు. వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు వెన్నుపోటు దినం కార్యక్రమాన్నిపెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో నగరి నిర్వహించిన వెన్నుపోటు దినంలో ఆర్కే రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇంత వరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నెరవేర్చలేదు. ప్రజల్ని చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు మోసాలపై ఆర్డీఓకి అర్జీ ఇచ్చాం.
ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలి.రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని వదిలి ప్రజలకు సంక్షేమ కోసం పనిచేయాలి. కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో గంజాయి, మద్యం, ఇసుక అక్రమ రవాణా, మహిళలపై పైశాచికాలు తప్ప సురక్ష పాలన కరువైయింది. విద్యార్థులను,మహిళలను వెన్నుపోటు పొడిచారు కూటమి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్‌ను అప్పుల ఆంద్రప్రదేశ్‌గా మార్చింది ఈ కూటమి ప్రభుత్వం.

ఎన్నికల ముందు ఊగిపోయినా పవన్ కళ్యాణ్ నేడు మహిళలపై దారుణాలు జరుగుతున్న మాట రావడం లేదు.పవన్ కళ్యాణ్ తన సినిమా ప్రమోషన్ కోసం చూపిస్తున్న చొరవ ప్రజలపై లేదు.పదవ తరగతి పరీక్షలు కూడా సక్రమంగా నెరవేర్చలేని నారా లోకేష్ పప్పు. రెడ్ బుక్ రాజ్యాన్ని పక్కన పెట్టి ఇచ్చిన హామీలు అమలు చేయాలి.కూటమి ప్రభుత్వాన్ని రోడ్డుకు లాగుతాం’అని హెచ్చరికలు జారీ చేశారు.