ఈవీఎంల ప్రభుత్వాన్ని గద్దె దించి తీరుతాం | Public Protest Against Chandrabu One Year Rule | Sakshi
Sakshi News home page

ఈవీఎంల ప్రభుత్వాన్ని గద్దె దించి తీరుతాం

Jun 5 2025 9:08 AM | Updated on Jun 5 2025 9:08 AM

Public Protest Against Chandrabu One Year Rule

చంద్రబాబు అసమర్థ పాలకుడు 

పవన్‌కళ్యాణ్‌ ఉన్మాది రాజకీయ నేత 

మాజీ మంత్రి ప్రసన్నకుమార్‌రెడ్డి 

కూటమి ఏడాది వెన్నుపోటు పాలనపై సింహపురి.. జనభేరి మోగించింది. అసమర్థ ప్రభుత్వాన్ని దించే వరకు విశ్రమించబోమని రణన్నినాదం చేసింది. ఊరూవాడాల్లో పెల్లుబుకిన ప్రజాగ్రహం.. ఉద్యమ కెరటమై గర్జించింది. జిల్లా వ్యాప్తంగా బుధవారం నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ కార్యక్రమంలో ప్రజలు మండుటెండను సైతం లెక్క చేయకుండా పాల్గొని అధికార పార్టీ వెన్నులో వణుకు పుట్టించారు. కొన్ని చోట్ల పోలీసులు ర్యాలీలకు ఆటంకాలు సృష్టించారు. సర్వేపల్లిలో అయితే ఏకంగా తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న ఎంపీలనే అడ్డుకున్నారు. ప్రచార రథం డ్రైవర్‌ను బెదిరించి ముందుకు కదలనీయకుండా ఆపేశారు. కోవూరు, నెల్లూరు సిటీ నియోజకవర్గాల్లో వినూత్నంగా నల్లబెలూన్లతో భారీ సంఖ్యలో ఎండీయూ వాహనాలు, కూటమి హామీల మోసాలపై ఫ్లకార్డుల బాక్స్‌లతో నిరసన ర్యాలీల్లో పాల్గొన్నారు. 

కోవూరు: ఈవీఎంలతో గద్దె ఎక్కిన చంద్రబాబు ప్రభుత్వాన్ని త్వరలోనే గద్దె దించి తీరుతామని, ఏడాదిలోనే ప్రజల నుంచి వచ్చిన ఆగ్రహం ట్రైలర్‌ మాత్రమే అని రాష్ట్ర పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి హెచ్చరించారు. ఏడాది పాలన అంతా కుట్రలు, కుతంత్రాలతోనే పూర్తయిందని విమర్శించారు. ఎన్నికల హామీలు నెరవేర్చకుండా ప్రజలు వెన్నుపోటు పొడిచిన కూట మి ఏడాది పాలనపై  వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం కోవూరులో ‘వెన్నుపోటు దినం’ దిక్కులు పిక్కటిల్లేలా నిర్వహించారు. అనంతరం మీడియాతో ప్రసన్న మాట్లాడారు. ఏడాది కాలంలో ఒక్క పథకం కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. ప్రశ్నించిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. సిగ్గులేని ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజు వస్తుందన్నారు. రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. దళితులు, మహిళలు, ఆడబిడ్డలకు రక్షణ కరువైందన్నారు.  ప్రతి హామీని నెరవేర్చేలా కూటమి ప్రభుత్వంపై వత్తిడి తెస్తామన్నారు.  

పవన్‌ కళ్యాణ్‌.. చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయ్‌  
డీసీఎంగా పవన్‌కళ్యాణ్‌ ప్రజలకు చేసిందేమీ లేదని, గత ఎన్నికల ప్రచార సమయంలో 30 వేల మంది మహిళలను వలంటీర్లు కిడ్నాప్‌ చేశారని తప్పుడు ప్రచారం చేశారని, ఏడాదైనా వారిని తిరిగి రప్పించలేకపోయాడని, ఆయనకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. గతంలో కాపు ఉద్యమ కారులపై అక్రమ కేసులు బనాయిస్తే ఆ సమస్యలపైన పోరాడాల్సింది పోయి కూటమి ప్రభుత్వానికి వంత పాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు వీరి చలపతిరావు, రాధాకృష్ణారెడ్డి, ఏపీఎల్‌డీఏ చైర్మన్‌ గొల్లపల్లి విజయ్‌కుమార్, అనూప్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి, జెడ్పీటీసీ శ్రీలత, శ్రీనివాసులురెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి, శేషగిరిరావు, సతీష్‌రెడ్డి, షాహుల్, వైస్‌ ఎంపీపీ నరసింహులురెడ్డి, దినే‹Ùరెడ్డి, అహమ్మద్‌ తదితరులు ఉన్నారు.  

మోసం చేయడంలో దిట్ట   
∙మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి 
ఆత్మకూరు:     ప్రజలను మోసం చేయడంలో సీఎం చంద్రబాబు దిట్ట అని ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్‌ బస్టాండ్‌ వద్ద నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు  భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందజేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సూపర్‌సిక్స్‌ పథకాలకు మంగళం పాడుతూ ఏడాదిలోనే రూ.1.50 లక్షల కోట్ల అప్పులు చేసిన ఘనత చంద్రబాబు దక్కించుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. బాబు మాటలు నమ్మి ఓట్లు వేసిన ప్రజలు ఏడాదిలోనే ఆయన నిజస్వరూపం తెలుసుకున్నారని, దీంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు. వీటి గురించి ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్ట్‌లు చేస్తున్నారని, ప్రజలు చంద్రబాబుకు త్వరలోనే సరైన బుద్ధి చెబుతారని అన్నారు.

నమ్మించి నట్టేట ముంచాడు
∙కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి 
కావలి (జలదంకి): ఏడాది కూటమి పాలన అడుగడుగునా కుట్రలు, కుతంత్రాలు, దగా, దౌర్జన్యాలతో సాగిందని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం కావలి పట్టణంలో వెన్నుపోటు దినం కార్యక్రమం జరిగింది. భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజల నిరసన నినాదాలతో పట్టణం దద్దరిల్లింది. ఆయన నివాసం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి  వినతిపత్రం అందించారు. ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అన్ని వర్గాలను నమ్మించి నట్టేట ముంచిందన్నారు. బాబును నమ్మిన ప్రజలకు కన్నీటి కష్టాలే మిగిలాయన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను రెడ్‌బుక్‌ రాజ్యాంగం పేరుతో అక్రమ అరెస్ట్‌లు చేస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారని మండి పడ్డారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు ఇలా ప్రతి ఒక్కరిని కూటమి ప్రభుత్వం మోసం చేసిందన్నారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా కూటమికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. అక్రమ కేసులకు భయపడేది లేదని, వైఎస్సార్‌సీపీ ప్రజల పక్షాన పోరాటాలు చేస్తునే ఉంటుందని తెలిపారు.

వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్‌ బాబు
∙బుర్రా మధుసూదన్‌యాదవ్‌   
కందుకూరు: వెన్నుపోటుకు సీఎం చంద్రబాబు బ్రాండ్‌ అంబాసిడర్‌ అని వైఎస్సార్‌సీపీ కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ అన్నారు. వెన్నుపోటు దినాన్ని పురస్కరించుకొని బుధవారం కందుకూరులో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా చంద్రబాబు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో వివరించారు. ఎన్నికల్లో ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. నియోజకవర్గంలో ఏ పల్లెకు, గ్రామానికి, వార్డుకు వెళ్లినా చంద్రబాబునాయుడు నమ్మించి మోసం చేశారంటూ ప్రజలు చెబుతున్నారన్నారు. రాష్ట్రంలో జరుగతున్న అరాచకపాలనపై ప్రశి్నస్తున్నందుకే వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్‌ మీడియా యాక్టివిస్తులపై అక్రమ కేసులు ప్రభుత్వం పెడుతుందని బుర్రా అన్నారు. ఇటువంటి దుర్మార్గమైన పాలన ఎప్పుడూ చూడలేదని, ఎంతో మంది నియంతలు సైతం కనుమరుగైన విషయాన్ని ప్రభుత్వం గుర్తించుకోవాలన్నారు.  కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సూపర్‌సిక్స్‌ హామీలను అమలు చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటూ సబ్‌కలెక్టర్‌ తిరుమాణి శ్రీపూజకు వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్‌యాదవ్‌తో పాటు, ఇతర నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు.  

ప్రజలకే పంగనామాలు
∙ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి   
నెల్లూరు (అర్బన్‌): ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చి.. ఆ ప్రజలకే వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కిందని నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. నెల్లూరు నగరంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో బుధవారం ‘వెన్నుపోటు దినం’ నిర్వహించారు. వీఆర్‌సీ సెంటర్‌  నుంచి కలెక్టరేట్‌ వరకు జరిగిన ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్‌లో ఏఓ విజయకుమార్‌కు  వినతి పత్రం ఇచ్చారు.  చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దొంగ హామీలు, అబద్ధాలతో అధికారంలోకి వచ్చిందన్నారు. సంక్షేమ పథకాలను అటకెక్కించారన్నా రు. అభివృద్ధిని గాలికి వదిలేశారన్నారు. నెల్లూరు పార్లమెంట్‌ వైఎస్సార్‌సీపీ పరిశీలకులు జంకె వెంకటరెడ్డి నేతలు ఖలీల్‌ అహ్మద్, అంజాహుస్సేని, మొయిళ్లగౌరి, సురేష్, సమీర్‌ఖాన్, అబ్దుల్‌ మస్తాన్, సిద్దిఖ్, నేతాజీ సుబ్బారెడ్డి, మజ్జిగ జయకృష్ణారెడ్డి, ఊటుకూరు నాగార్జున, అశ్రిత్‌రెడ్డి, చీదెళ్ల కిషన్, కొణిదెల సు«దీర్, కోటేశ్వరెడ్డి, కార్పొరేటర్లు, డివిజన్‌ ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.    

వంచన ఆయన నైజం ∙మేకపాటి రాజగోపాల్‌రెడ్డి 
ఉదయగిరి:  బిడ్డనిచ్చిన సొంత మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ప్రజలను మోసం చేయడం, వెన్నుపోటు పొడవడం పెద్ద లెక్క కాదని ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఉదయగిరిలో బుధవారం పార్టీ జరిగిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సూపర్‌ సిక్స్‌ హామీలతో జనాన్ని బోల్తా కొట్టించి అధికారంలోకి వచ్చారు.  ఏడాది అయినా ఒక్క హామీ అమలు చేయలేదు. రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో వైఎస్సార్‌సీపీ నేతలను, కార్యకర్తలను హించిస్తూ తప్పడు కేసులు పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పిందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement