చంద్రబాబు వెన్నుపోటుకు థర్టీ ఇయర్స్‌ | Chandrababu Naidu Backstabbed His Father-In-Law NTR: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

చంద్రబాబు వెన్నుపోటుకు థర్టీ ఇయర్స్‌

Aug 31 2025 3:39 AM | Updated on Aug 31 2025 3:39 AM

Chandrababu Naidu Backstabbed His Father-In-Law NTR: Andhra Pradesh

1995లో సెప్టెంబర్‌ 1న మామ ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసి సీఎం పీఠం లాక్కొన్న చంద్రబాబు

పార్టీ, పార్టీ ఆస్తులు కూడా స్వాదీనం చేసుకుని నిర్దాక్షిణ్యంగా గెంటివేత 

ఎల్లో మీడియాలో ఎన్టీఆర్‌ వ్యక్తిగత జీవితంపై నీచపు రాతలు 

ప్రజాస్వామ్యాన్ని బతికించమని వైశ్రాయ్‌ హోటల్‌ వద్దకు వచ్చిన ఆయనపై చెప్పులదాడి 

తనకు మాత్రమే సాధ్యమైన కపటోపాయాలతో కుటుంబసభ్యులనూ దూరం చేసిన బాబు 

తన అల్లుడు మోసగాడు, నయవంచకుడని నాడు ఇంటర్వ్యూలో చెప్పిన ఎన్టీఆర్‌ 

జామాత దశమగ్రహమని మండిపాటు.. బాబు రాజకీయ చరిత్ర అంతా కుట్రలు, కుతంత్రాలే 

తాజాగా లోకేశ్‌కు  పోటీ వస్తాడని జూనియర్‌ ఎన్టీఆర్‌పై పార్టీ  నేతలతో బూతుల దండకం

సాక్షి, అమరావతి: ‘చంద్రబాబు మోసగాడు.. నయవంచకుడు.. తండ్రిని జైల్లో పెట్టి, అన్నల్ని చంపించిన ఔరంగజేబు కంటే నీచుడు. నా కుమార్తెని ఇచ్చి పెళ్లి చేస్తే తండ్రిలాంటి వాణ్ని నిలువునా మోసం చేశాడు. అతడిలో మానవత్వం ఏమైనా ఉంటుందేమో అని పరీక్షించాను. మనిషిని కాదు.. పశువుని, నమ్మిన వాళ్లకు ద్రోహం చేస్తా, నమ్మిన వాళ్ల గొంతు కోస్తా అని చెప్పి నిరూపించుకున్న ఘాతకుడు.. చంద్రబాబు. దీన్ని చరిత్ర మరువదు. మొఘల్‌ సామ్రాజ్యంలో ఔరంగజేబు తండ్రిని జైల్లో పెట్టి, అన్నల్ని చంపించాడు అని విన్నాం.

అదేవిధంగా కేవలం పదవి కోసం తండ్రి లాంటి  నాకు ద్రోహం చేశాడు. చంద్రబాబు ఏవిధంగా ఆత్మను అమ్ము­కున్నాడో, ఏవిధంగా మానవత్వాన్ని చంపుకున్నాడో ఇదే నిదర్శనం. ఇది శాశ్వతంగా ఉంటుంది. మనిషి పోతాడేమో.. ప్రజల మనసుల్లో పోదు, ఆలోచన పోదు, రికార్డు పోదు, అది శాశ్వతం’.. ఇవి తన అల్లుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎలాంటి వాడో వివరిస్తూ విఖ్యాత సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఒక ఇంటర్వ్యూలో అన్న మాటలు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా దేశ రాజ­కీయాల్లోనే ఎవరూ ఒడిగట్టని రాజకీయ మహాపాతకం.. ‘వెన్నుపోటు’కు చంద్రబాబు శ్రీకా­రం చుట్టి సోమవారానికి 30 ఏళ్లు. 1994 అసెంబ్లీ ఎ­న్ని­కల్లో టీడీపీ ఘనవిజయం సాధించడంతో ఎన్టీఆర్‌ ము­ఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచే ఆ పదవి కోసం గోతి కాడ గుంటనక్కలాగా చంద్ర­బా­బు మాటు వేశారు. తనకు బాకా ఊదే ఎల్లో మీ­డియాలో ఎన్టీఆర్‌ వ్యక్తిగత జీవితంపై నీచపు రాతలు రా­యించారు. మందు, విందు, పొందు.. ఇలా తనకు మా­త్రమే సాధ్యమైన ప్రలోభాలతో ఎమ్మెల్యేలకు ఎ­ర­వే­సి వారిని తనవైపునకు తిప్పుకున్నారు.

1995 సెప్టెంబర్‌ 1న ముఖ్యమంత్రిగా ఉన్న తన సొంత మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి సీఎం పదవిని గుంజుకున్నారు. అంతేకాకుండా ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీని, పార్టీ ఆస్తులను కూడా లాక్కొని ఎన్టీఆర్‌ను నిర్దాక్షిణ్యంగా పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి గెంటేశారు. కుటుంబ సభ్యులనూ దూరం చేసి ఎన్టీఆర్‌ను తీవ్ర క్షోభకు గురిచేశారు. అయినా కసితీరక ప్రజాస్వామ్యాన్ని బ్రతికించమని ఎమ్మెల్యేలను అభ్యర్థించడానికి హైదరాబాద్‌లోని వైశ్రాయ్‌ హోటల్‌ వద్దకు వచ్చిన ఎన్టీఆర్‌పై తన అనుంగు ఎమ్మెల్యేలతో చంద్రబాబు చెప్పులదాడి చేయించారు.

ఇలా అప్పటివరకు భారతదేశ రాజకీయ చరిత్ర ఎరుగని మహాకిరాతకానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. తన సొంత అల్లుడు చేసిన కుట్ర, వెన్నుపోటు, దారుణ అవమానాలను తట్టుకోలేక ఎన్టీఆర్‌ కొద్ది కాలానికే 1996, జనవరి 18న తీవ్రమైన గుండెపోటుతో కన్నుమూశారు. చంద్రబాబు చేసిన ఆ మహాకిరాతకం తెలుగు నేలపై ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది. 

కపటత్వంతో ఎన్టీఆర్‌ పంచన చేరి.. 
1983 అసెంబ్లీ ఎన్నికల్లో తన మామ ఎన్టీఆర్‌నే ఓడిస్తానని భీషణ ప్రతిజ్ఞ చేసి కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి చిత్తుగా ఓడారు.. చంద్రబాబు. ఆ తర్వాత తనను మంత్రిని చేసిన కాంగ్రెస్‌ పార్టీకి మొదటి వెన్నుపోటు పొడిచారు. ఆ పార్టీని వదిలేసి మామ ఎన్టీఆర్‌ పంచన చేరారు. తద్వారా తనకు ఎలాంటి విలువలూ లేవని.. అధికారం, డబ్బే ముఖ్యమని చంద్రబాబు చాటుకున్నారు. ఆయనకు ఎన్టీఆర్‌ తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తే.. చంద్రబాబు మాత్రం కృతజ్ఞత మరిచి తన మామ ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచారు.

ఎన్టీఆర్‌కు 70 ఏళ్ల వయసులో కుటుంబం అండగా నిలవకుండా చేశారు. నందమూరి కుటుంబాన్ని మాయమాటలతో లొంగదీసుకుని తన వెన్నుపోటుకు వారిని పావులుగా వాడుకున్నారు. ఎన్టీఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీని, గుర్తును, పార్టీ ఆస్తులను కుట్రపూరితంగా సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్‌ బ్యాంకు ఖాతాను స్తంభింపజేశారు. ఎమ్మెల్యేలంతా చంద్రబాబు ప్రలోభాల వలలో పడ్డారని గ్రహించిన ఎన్టీఆర్‌.. వారికి నిజం చెప్పడానికి వైశ్రాయ్‌ హోటల్‌కు వెళితే ఎన్టీఆర్‌పై చెప్పులతో దాడి చేయించారు. త్మాభిమానం, ఆత్మగౌరవం నినాదాలతో పార్టీ పెట్టిన ఎన్టీఆర్‌ ఈ దారుణమైన అవమానాన్ని తట్టుకోలేక కుంగిపోయారు.

ఇంత చేసినా కసి తీరని చంద్రబాబు అసెంబ్లీలోనూ ఎన్టీఆర్‌కు మాట్లాడే అవకాశం కల్పించకుండా అడ్డుకున్నారు. అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో చరిత్రను తిరగరాసిన ఎన్టీఆర్‌.. చంద్రబాబు కుట్రలకు కంటతడి పెట్టుకున్నారు. అదే క్షోభతో గుండెపోటుతో కన్నుమూశారు. తాను జీవించి ఉండగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబుని జా­మాత (అల్లుడు) దశమ గ్రహంగా తూర్పా­రబ­ట్టా­రు. 

వెన్నుపోటుకు బ్రాండ్‌ అంబాసిడర్‌
వెన్నుపోట్లు, మోసం, నయవంచన, కపటత్వం, కుటిలత్వం, హత్యా రాజకీయాలనే తన ఎదుగుదలకు మెట్లుగా మార్చుకున్న చంద్రబాబు తనను ఒక విజనరీగా చూపించుకునేందుకు ఎల్లో మీడియాను ఉప­యో­గించుకున్నారు. చంద్రబాబు చెప్పుచేతల్లో ఉండే ఈ మీడియా ఆయనను అభివృద్ధి ప్రదాతగా కీర్తిస్తూ నిత్యం ప్రజలను ఏమారు­స్తూనే ఉంది. అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం, ఆ తర్వాత ప్రజలను నిలువునా ముంచడం చంద్రబాబుకు వెన్ను­పోటుతో పెట్టిన విద్య. వెన్నుపోటుకు చంద్రబాబును బ్రాండ్‌ అంబాసిడర్‌గా చెబుతారు.

30 ఏళ్ల క్రితం సొంత మామకు వెన్నుపోటు పొడిచి సీఎం అయిన బాబు ఆ తర్వాత ప్రతి ఎన్నికల్లోనూ హామీల పేరుతో ప్రజలను నిలువునా వంచిస్తూనే ఉన్నారు. తన రాజకీయ పీఠాన్ని, తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి తెలుగు రాజకీయాలనే భ్రష్టు పట్టించిన వ్యక్తిగా రాజకీయ విశ్లేషకులు చంద్రబాబును చూపుతారు. రాజకీయాలను హత్యలు, డబ్బు మయం చేసి, కుట్రలు, కుతంత్రాలతో అపర చాణక్యుడిగా ఎల్లో మీడియా నీరాజనాలు అందుకుంటున్నారు.

ఎన్టీఆర్‌కే కాదు కుటుంబ సభ్యులకూ వెన్నుపోటే
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులనూ వదల్లేదు. బావమరిది హరికృష్ణ, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు వంటి వారిని ఆ తర్వాత పార్టీలో లేకుండా చేశారు. దగ్గుబాటి, ఆయన భార్య పురందేశ్వరి కాంగ్రెస్‌లో చేరిపోయారు. హరికృష్ణ కూడా చంద్రబాబు కుట్ర రాజకీయాలను అర్థం చేసుకుని అన్న తెలుగుదేశం పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు.

ఎన్టీఆర్‌ పథకాలకూ తిలోదకాలు..
వెన్నుపోటుతో ఎన్టీఆర్‌ మరణానికి కార­కుడైన చంద్రబాబు తాను రాజకీయంగా తెరమ­రుగవుతున్న ప్రతిసారీ ఎన్టీఆర్‌ జపం చేశారు. ఎన్టీఆర్‌ మరణానంతరం ఎక్కడా, ఎందులోనూ ఆయన ఆనవాళ్లు లేకుండా చేశారు. ఎన్టీఆర్‌ తెచ్చిన మద్య నిషేధం, రెండు రూపాయల బియ్యం తదితర పథకాలను ఎత్తేశారు. అటు పార్టీలోనూ ఎన్టీఆర్‌ జ్ఞాపకాలు లేకుండా చెరిపేశారు. ఇప్పుడు రాజకీయ అవసరాలకు మాత్రం ఎన్టీఆర్‌ పేరు, బొమ్మను వాడుకుంటున్నారు. ఎన్టీఆర్‌ను పొగుడుతూ ఆయన గొప్పతనం గురించి చెబుతూ ఆయ­నను మించిన మహానటుడి పాత్ర పోషిస్తుండటంతో చంద్రబాబులో ఇంత మంచి నటుడు ఉన్నాడా అని టీడీపీ నేతలే నివ్వెరపోతున్నారు.

ఇప్పుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ టార్గెట్‌గా మళ్లీ కుట్రలు.. 
2009 అసెంబ్లీ ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఎదుర్కోవడానికి మళ్లీ చంద్రబాబుకు మళ్లీ ఎన్టీఆర్‌ కుటుంబం అవసరమైంది. ఆ ఎన్నికల్లో జూనియర్‌ ఎన్టీఆర్‌ని పార్టీ ప్రచారానికి వాడుకున్నారు. అవసరం తీరిపోయాక తన కు­మారుడు నారా లో­కేశ్‌­కు పోటీ వ­స్తాడేమోనని తన ఎల్లో మీడియాలో నీచపు కథనాలు ప్రసారం చే­యించారు. అంతేకాకుండా ఇటీవల అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌తో జూనియర్‌ ఎన్టీఆర్‌ తల్లిపై అసభ్య వ్యాఖ్యలు చేయించారు. ఇలా చివరకు జూనియర్‌ ఎన్టీఆర్‌ను కూడా తన కుట్రపూరిత రాజకీయాలకు చంద్రబాబు బ­లి­పెడుతున్నారు.

ఔరంగజేబును గుర్తు చేసిన చంద్రబాబు
ఆధునిక భారత రాజకీయాల్లో వెన్నుపోటు అంకానికి తెరలేపి ఔరంగజేబును చంద్రబాబు గుర్తు చేశారు. ఈ దారుణమైన అంశం చర్చకు రాకుండా బాబు అనుకూల మీడియా తొక్కేసింది. తద్వారా నైతిక విలువలను దిగజార్చింది. ప్రజాస్వామ్యబద్ధంగా అఖండ మెజారిటీతో ఎన్నికైన ఎన్టీఆర్‌ను కూలదోయడంలో బాబు అనుకూల మీడియా కీలక పాత్ర వహించింది. ఇప్పుడు కూడా  అలాంటి పరిస్థితే ఉంది. సత్యం ముందుకు రాకుండా అసత్యాలను, పచారం చేస్తున్నాయి. – విజయబాబు, ఆర్టీఐ మాజీ కమిషనర్, మాజీ సంపాదకులు  

సీఎం పదవి కోసమే ఎన్టీఆర్‌ను దించేశారు
చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలనే కోరికతోనే 1995లో ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేశారు. పార్టీని నిలబెట్టుకునేందుకే అలా చేశామని చెప్పుకుంటున్నా అది వాస్తవం కాదు. కేవలం తన కోసమే చంద్రబాబు ఇదంతా చేయించారు. ఆ సమ­యంలో ఎన్టీఆర్‌ ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నారు. చంద్రబాబు ఆయన్ను వదిలేసి మధ్యలోనే హైదరాబాద్‌ వెళ్లిపోయి వైశ్రాయ్‌ హోటల్‌లో మకాం వేశారు.

అప్పట్లో మీడియాను మేనేజ్‌ చేసి తమ వద్దకు 40 మంది ఎమ్మెల్యేలు వచ్చారని, 50 మంది.. 60 మంది వచ్చారని ప్రచారం ప్రారంభించారు. ఈ ప్రచారాన్ని చూసి చాలామంది ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్లారు తప్ప నిజంగా అంతమంది ఎమ్మెల్యేలు అక్కడ లేరు. ఈ వ్యవహారంలో న్యాయ వ్యవస్థ, ఎన్నికల సంఘాన్ని చంద్రబాబు తనకు అనుకూలంగా వినియోగించుకున్నారనే ఆరోప­ణలు­న్నా­యి.    – దారా గోపి, సీనియర్‌ జర్నలిస్టు, విజయవాడ 

ఎల్లో మీడియాలో ఎన్టీఆర్‌ ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేయించి.. 
ఎన్టీఆర్‌ కేబినెట్‌లో ఉంటూనే తనకు అనుకూలంగా పత్రికల్లో కథనాలు వచ్చేలా, ఎన్టీఆర్‌ వ్యవహారాలపై లీకులు ఇస్తూ ఆయన ఇమేజీని చంద్రబాబు డ్యామేజీ చేసేవారు. ప్రభుత్వ పాలన సరైన దిశలో నడవడం లేదంటూ, లక్ష్మీపార్వతిని బూచిగా చూపించారు. ఎన్టీఆర్‌ అసెంబ్లీని రద్దు చేస్తారంటూ విస్తృతంగా ప్రచారంలోకి తీసుకుని వచ్చి.. ఎమ్మెల్యేలను భయభ్రాంతులకు గురిచేశారు. ఎన్టీఆర్‌ కేబినెట్‌ అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేస్తే.. అప్పటి రాష్ట్ర గవర్నర్‌ కృష్ణకాంత్‌ సహకారంతో ఆ తీర్మానాన్ని అడ్డుకున్నారు. స్పీకర్‌ యనమల రామకృష్ణుడు ఎలాగూ తన మనిషే కావడం చంద్రబాబుకు కలిసి వచ్చింది. అదే సమయంలో పోలీసు ఉన్నతాధికారులను కూడా చంద్రబాబు మచ్చిక చేసుకున్నారు.  – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement