కుంజా రజితకి వైఎస్ జగన్ అభినందనలు | YS Jagan Congratulate Kunja Rajitha For Gold Medal | Sakshi
Sakshi News home page

కుంజా రజితకి వైఎస్ జగన్ అభినందనలు

Jun 3 2025 5:05 PM | Updated on Jun 3 2025 5:56 PM

YS Jagan Congratulate Kunja Rajitha For Gold Medal

సాక్షి, గుంటూరు: భారత అథ్లెట్ కుంజా రజిత(Kunja Rajitha)కి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. దక్షిణ కొరియాలోని గుమిలో జరిగిన 26వ ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 4x400 రిలేలో ఆమె స్వర్ణం గెలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ వైఎస్‌ జగన్‌ తన ఎక్స్‌ ఖాతాలో మంగళవారం ఓ ట్వీట్‌ చేశారు. 

‘‘రజిత అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రామచంద్రపురానికి చెందిన మహిళ కావటం మనకు గర్వకారణం. 2028లో దేశం తరపున ఒలింపిక్ పతకం సాధించాలనే ఆమె కల సాకారం కావాలని ఆశిస్తున్నా’’ అని తన సందేశంలో ఆకాంక్షించారాయన.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement