
సాక్షి, తాడేపల్లి: నేడు స్వాతంత్ర్య సమరయోధుడు బాలగంగాధర తిలక్ జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్.. బాలగంగాధర తిలక్‌కు నివాళులు అర్పించారు. దేశసేవకు ఆయన చేసిన త్యాగాలను స్మరించుకున్నారు.
వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘స్వరాజ్యం నా జన్మ హక్కు. నేను దాన్ని పొంది తీరుతాను’ అని గర్జించి స్వాతంత్ర్య పోరాటంలో తొలి ఉద్యమ జ్వాలలు రగిలించిన మహానాయకుడు బాలగంగాధర్ తిలక్. దేశసేవకు ఆయన చేసిన త్యాగాలను స్మరించుకుంటూ బాలగంగాధర్ తిలక్ జయంతి సందర్భంగా నివాళులు’ అర్పించారు.

‘స్వరాజ్యం నా జన్మ హక్కు. నేను దాన్ని పొంది తీరుతాను’ అని గర్జించి స్వాతంత్ర్య పోరాటంలో తొలి ఉద్యమ జ్వాలలు రగిలించిన మహానాయకుడు బాలగంగాధర్ తిలక్ గారు. దేశసేవకు ఆయన చేసిన త్యాగాలను స్మరించుకుంటూ బాలగంగాధర్ తిలక్ గారి జయంతి సందర్భంగా నివాళులు. pic.twitter.com/z7sYb1MBAA
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 23, 2025