ఏపీలో పొంచి ఉన్న వంట గ్యాస్ కొరత | Andhra Pradesh to Face LPG Shortage Stocks Enough for Only 5 Days | Sakshi
Sakshi News home page

ఏపీలో పొంచి ఉన్న వంట గ్యాస్ కొరత

Mar 11 2026 11:23 PM | Updated on Mar 12 2026 10:27 AM

Andhra Pradesh to Face LPG Shortage Stocks Enough for Only 5 Days

సాక్షి, విజయవాడ: ఏపీలో వంట గ్యాస్ కొరత పొంచి ఉంది. రాష్ట్రంలో గ్యాస్ నిల్వలు నిండుకున్నాయి. ఇక 5 రోజులకు మాత్రమే గ్యాస్ నిల్వలు ఉన్నాయని కలెక్టర్ల సదస్సులో అధికారులు వెల్లడించారు.

రాష్ట్రంలో 1.61 కోట్ల డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లు, 10 లక్షల కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయి. హెచ్ పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ సహా వివిధ కంపెనీల నుంచి గ్యాస్ సరఫరా అవుతోంది. రాష్ట్రంలో రోజూ 4 వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ డిమాండ్ ఉండగా గ్యాస్ కంపెనీల వద్ద ప్రస్తుతం 21505 మెట్రిక్ టన్నుల గ్యాస్ నిల్వలు మాత్రమే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఎల్పీజీ సహా వివిధ ఉద్యాన ఉత్పత్తుల మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి మంత్రులతో కమిటీ వేసింది ఏపీ ప్రభుత్వం. ఈ మంత్రుల కమిటీలో సభ్యులుగా నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ సభ్యులు ఉన్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement