
సాక్షి, తాడేపల్లి: జగదీప్ ధన్‌ఖడ్ త్వరగా కోలుకోవాలంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు. ఉప రాష్ట్రపతిగా, రాజ్యసభ ఛైర్మన్‌గా ధన్‌ఖడ్ దేశానికి ఎంతో సేవ చేశారన్నారు.
‘‘ఎంతో అంకితభావంతో ఆయన దేశం కోసం పని చేశారు. అనారోగ్య కారణాల వల్ల పదవీ విరమణ చేసిన ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. మంచి ఆరోగ్యంతో ఎప్పట్లాగే దేశ ప్రజలకు మార్గదర్శకంగా ఉండాలని ఆశిస్తున్నాను’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.
Shri Jagdeep Dhankhar Ji served the nation with grace and dedication as Vice President and Rajya Sabha Chairman. As he steps down due to health reasons, I sincerely wish him a speedy recovery and good health so he may continue to guide the nation with his wisdom. pic.twitter.com/DE7kDFcWmx
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 22, 2025