ఇదీ ఏపీలో నెలకొన్న పరిస్థితి: వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ | Ys Jagan Tweet On The Situation Under Chandrababu Govt Rule | Sakshi
Sakshi News home page

ఇదీ ఏపీలో నెలకొన్న పరిస్థితి: వైఎస్‌ జగన్‌ ట్వీట్‌

Jun 3 2025 10:00 PM | Updated on Jun 3 2025 10:16 PM

Ys Jagan Tweet On The Situation Under Chandrababu Govt Rule

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసుల వ్యవహారశైలి దారుణంగా తయారైందని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. తెనాలి ఘటన సహా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, ఇవాళ తెనాలిలో తన పర్యటన గురించి ఆయన ట్వీట్ చేశారు.

‘‘తెనాలిలో ముగ్గురు యువకులపై పోలీసులు అకారణంగా దాడి చేశారు. వారిలో ఒకరు జూనియర్ అడ్వకేట్, మరొకరు పాలిటెక్నిక్ గ్రాడ్యుయేట్, మూడో యువకుడు మెకానిక్. ఒకరు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుండగా, మిగతా ఇద్దరూ మంగళగిరికి చెందినవారు. మంగళలగిరికి చెందిన యువకులను తెనాలి పోలీసులు అరెస్టు చేశారు.

..ఆ యువకులను తీవ్రంగా గాయపరచటమే కాకుండా దారుణంగా అవమానపరిచారు. సివిల్ డ్రెస్‌లో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి చేశారంటూ కేసు పెట్టారు. ఈ కేసు తర్వాతనే వారిపై రౌడీ‌షీట్ కూడా ఓపెన్ చేశారు. పోలీసులు కోర్టుల అధికారాన్ని కూడా తమ చేతుల్లోకి తీసుకున్నారు. ఇది రాజ్యాంగ హక్కులను కాల రాయటమే’’ అని వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘అదే తెనాలిలో ఒక మార్వాడీ యువకుడు పోలీసుల చర్యలను నిరసిస్తూ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రకాశం జిల్లా జాళ్లపాలెంలో కూడా ఎస్ఐ రమేష్ బాబు ఒక ఇంట్లోకి చొరపబడి మహిళపై దాడి చేశాడు. వారి అనుమతి లేకుండా సీసీటీవీ పుటేజీ తీసుకెళ్లారు. అదేమని ప్రశ్నిస్తే ఎట్రాసిటీ కేసులు నమోదు చేశారు. శాతవాహన కాలేజీ ప్రిన్సిపాల్ వంకాయలపాటి శ్రీనివాస్‌ను టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మనుషులు కిడ్నాప్ చేస్తే సరైన చర్యలే తీసుకోలేదు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఇదీ ఏపీలో నెలకొన్న పరిస్థితి’’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement