మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ ఫైర్‌ | Ysrcp Leaders Fires On Minister Atchannaidu Comments | Sakshi
Sakshi News home page

మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ ఫైర్‌

Jul 22 2025 6:11 PM | Updated on Jul 22 2025 7:05 PM

Ysrcp Leaders Fires On Minister Atchannaidu Comments

సాక్షి, తాడేపల్లి: మంత్రి అచ్చెనాయుడు వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయాలంటే డ‌బ్బులు కావాలి.. ఆడ‌బిడ్డ నిధి ప‌థ‌కం అమ‌లు చేయాలంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అమ్మాలి’’ అంటూ మాట్లాడ‌డానికి సిగ్గులేదా అచ్చెన్నాయుడూ?’’ అంటూ ఆర్కే రోజా ట్వీట్‌ చేశారు. ఎన్నిక‌ల ముందు హామీలు ఇచ్చేట‌ప్పుడు తెలియ‌దా?. అప్పుడేమో ఓట్లు కోసం అడ్డ‌మైన హామీలు ఇచ్చి.. అధికారంలోకి వ‌చ్చాక ఇలా మాట్లాడమ‌ని  మీ నాయ‌కుడు చంద్రబాబు చెప్పారా?’’ అంటూ ఆర్కే రోజా ఎక్స్‌ వేదికగా నిలదీశారు.

అమ‌లు చేయ‌లేన‌ప్పుడు హామీలు ఎందుకిచ్చారు?: విడదల రజిని
ఒక్క హామీని కూడా అమ‌లు చేయ‌కుండా సుప‌రిపాల‌న‌కు తొలి అడుగు అంటూ టీడీపీ వాళ్లు మాట్లాటం చాలా విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి విడదల రజిని ట్వీట్‌ చేశారు. చంద్రబాబు సంప‌ద సృష్టిస్తా, సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తాన‌ని చెప్పారు. ఇప్పుడేమో అచ్చెన్నాయుడు ఆడ‌బిడ్డ నిధి` ప‌థ‌కం అమ‌లు చేయాలంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అమ్మాలంటూ మాట్లాడుతున్నారు. సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌లేన‌ప్పుడు ఎందుకు హామీలు ఇచ్చారు?’’ అంటూ విడదల రజిని ప్రశ్నించారు.

అచ్చెన్నాయుడు వ్యాఖ్య‌లు దుర‌దృష్ట‌క‌రం: వరుదు కల్యాణి
‘‘ఆడ‌ బిడ్డ‌ల క‌ష్టాలు తాను క‌ళ్లారా చూశాన‌ని.. వారిని ఆ క‌ష్టాల నుంచి బ‌య‌ట ప‌డేయ‌డానికి ఆడ‌బిడ్డనిధి ప‌థ‌కం తీసుకువ‌చ్చామ‌ని  ఎన్నిక‌ల ముందు చంద్రబాబు ప్ర‌తి స‌భ‌లోనూ ప్ర‌చారం చేశారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికీ ప్ర‌తి నెలా రూ.1,500లు ఇస్తామ‌న్నారు. అధికారంలోకి వ‌చ్చాక మొద‌టి ఏడాది ఇవ్వ‌నే లేదు. ఇప్పుడేమో ఆడ‌బిడ్డ నిధి పథ‌కం అమ‌లు చేయాలంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను అమ్ముకోవాలంటూ అచ్చెన్నాయుడు వ్యాఖ్య‌లు చేయ‌డం దుర‌దృష్ట‌క‌రం’’ అంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు.

ఇది మంచి ప్ర‌భుత్వ‌మా చంద్రబాబూ?: పుష్పశ్రీవాణి
ఎన్నిక‌ల ముందేమో సంప‌ద సృష్టిస్తాం, సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తామన్నారు. ఓట్లు వేయించుకుని గ‌ద్దెనెక్కిన త‌ర్వాత సంక్షేమప‌థ‌కాలు అమ‌లు చేయ‌లేమ‌ంటున్నారు. ఆడబిడ్డ నిధి` ప‌థ‌కం అమ‌లు చేయాలంటే ఆంధ్ర‌ప్రదేశ్‌ను అమ్ముకోవాలంటూ వ్యాఖ్య‌లు చేయ‌డం మీకు త‌గునా అచ్చెన్నాయుడూ?. ఇది మంచి ప్ర‌భుత్వ‌మా చంద్రబాబూ?’’ అంటూ మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి ఎక్స్‌ వేదికగా నిలదీశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement