కాంగ్రెస్‌ పార్టీకి త్వరలో రాజీనామా | Resignation from Congress party soon says Jeevan Reddy | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పార్టీకి త్వరలో రాజీనామా

Mar 16 2026 3:50 AM | Updated on Mar 16 2026 3:50 AM

Resignation from Congress party soon says Jeevan Reddy

మాజీమంత్రి జీవన్‌రెడ్డి 

రాయికల్‌ (జగిత్యాల): కాంగ్రెస్‌ పార్టీకి త్వరలో రాజీనామా చేయనున్నట్లు ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీమంత్రి జీవన్‌రెడ్డి తెలిపారు. జగిత్యాల జిల్లా రాయికల్‌ పట్టణంలో ఆదివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, దశాబ్దాలకాలం కాంగ్రెస్‌కు సేవలందించానని, ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇమడలేకపోతున్నానని, ఈ క్రమంలో మొదటగా పార్టీకి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. 

రాజీనామా లేఖను ఢిల్లీకి వెళ్లి అధిష్టానానికి అందజేస్తారా? అని ప్రశ్నించగా.. ఇక్కడే చేస్తానని తెలిపారు. రంజాన్, ఉగాది పండుగల అనంతరం మరోసారి అభిమానులతో సమావేశమై ఏ పార్టీలోకి వెళ్లాలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement