
అక్రమ కేసులు, అరెస్ట్లను తీవ్రంగా ఖండించిన వైఎస్సార్సీపీ అధినేత
రమేష్ కుమార్‌రెడ్డి విడుదల
సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిపై రాజకీయ విమర్శలు చేశారనే కారణంతో పోలీసులు నమోదు చేసిన ఆక్రమ కేసులో ఆరెస్ట్ అయిన వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్. రెడ్డిని మాజీ సీఎం వైఎస్ జగన్ సోమవారం. ఫోన్లో పరామర్శించారు. ఆయనపై నమోదు చేసిన అక్రమ కేసుల వివరాలు, ఆరెస్ట్ గురించి అడిగి తెలుసుకున్నారు.
రెడ్‌బుక్ రాజ్యాంగంలో భాగంగా అక్రమ కేసులు నమోదు చేయడం, భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నించడం బాధాకరమని వైఎస్ జగన్ అన్నారు. పోలీసుల అక్రమ కేసులు, అరెస్ట్లను తీవ్రంగా ఖండిం చారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అందుబాటులో ఉండి అవసరమైన న్యాయ సహాయం అందిస్తుందని రమేష్ కుమార్ రెడ్డికి భరోసా ఇచ్చారు.
చిన్నమండెం: అక్రమ కేసులో అరెస్టు అయిన మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్రెడ్డి సోమవారం విడుదలయ్యారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె నుంచి చిన్నమండెం పోలీస్ స్టేషన్ కు ఆయనను పోలీసులు తీసుకువచ్చారు. రాయచోటి రూరల్ సీఐ వరప్రసాద్, ఎస్ఐఐ సుధాకర్ 41 నోటీసు ఇచ్చి ఆయనను సోమవారం విడుదల చేశారు. అనంతరం రమేష్ కుమార్‌రెడ్డికి వైఎస్సార్సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.