వయసు 70 ఏళ్లు.. ఇప్పటికీ 40 కి.మీ. సైకిల్‌పైనే.. | 70 Year old surat textile tycoon suresh jariwala pedals 40km daily on 3-decade-old cycle | Sakshi
Sakshi News home page

World Bicycle Day: 70 ఏళ్ల వ్యాపారవేత్త ఫిట్‌నెస్‌కి ఫిదా అవ్వాల్సిందే! ఇప్పటకీ 40 కి.మీ.లు సైకిల్‌పైనే..

Jun 3 2025 1:41 PM | Updated on Jun 18 2025 4:18 PM

70 Year old surat textile tycoon suresh jariwala  pedals 40km daily on 3-decade-old cycle

చిన్న వ్యాపారమే నడుపుతున్నా.. రయ్‌రయ్‌మని.. బైక్‌ లేదా కార్లలలో వెళ్తుంటారు. పైగా అది స్టేటస్‌ సింబల్‌గా పలువురి అభిప్రాయం కూడా. అలాంటి ఈ రోజుల్లో ఓ తాతా గారు వ్యాపారవేత్తగా చెలామణి అవుతున్నా.. ఇప్పటికీ సాధారణ సైకిల్‌పైనే తన ఫ్యాక్టరీకి వెళ్తుంటాడు. అది కూడా ఏకంగా 30 కిలోమీట‌ర్లు పైనే తొక్కుతూ వెళ్లడం విశేషం. ఇవాళ వరల్డ్‌ సైక్లింగ్‌ డే సందర్భరంగా అంతలా ఫిట్‌నెస్‌ ప్రాముఖ్యత ఇచ్చి సైక్లిల్‌పైనే రాకపోకలు సాగిస్తున్న ఆ తాతగారు గురించి తెలుసుకుందామా..!

అతడే 70 ఏళ్ల సురేష్ జరివాలా. ఆయన్ను సైక్లింగ్‌ లెజెండ్‌గా పేర్కొన్నవచ్చు. ఆయన రోజు ఉదయం 5.45 గంటలకు ప్రారంభమవుతుంది. స్వతహాగా వస్త్ర వ్యాపారవేత్త అయినా ఆయన ఫిట్‌నెస్‌కి వీరాభిమాని. వ్యాపారిగా తన కెరీర్‌ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు సైకిల్‌పైనే రాకపోకలు సాగిస్తున్నాడు. మెరిసే కార్లు, బైక్‌లు ఆయన దరిచేరలేకపోయాయి లేదా ఆయన్ను ఆకర్షించడంలో విఫలమయ్యాయి అని చెప్పొచ్చు. 

ఎందుకంటే సూరత్‌లో ఫ్యాక్టరీ ఉన్నప్పుడూ.. సైకిల్‌పైనే వెళ్లేవాడు. ఆ తర్వాత 1982లో ఫ్యాక్టరీ అంక్లేశ్వర్‌కు మారినా.. అతని తీరు మారకపోవడం విశేషం. నిజానికి సూరత్‌ని సలాబత్‌పురా నుంచి అంకలేశ్వర్‌ రావాలంటే కచ్చితంగా కారు లేదా బైక్‌ ఉంటేనే వెళ్లడం సాధ్యం. ఎందుకంటే ఈ తాతగారు సూరత్‌లోని తన ఇంటి నుంచి స్టేషన్‌కి మూడు కిలోమీట‌ర్లు సైకిల్‌పై ప్రయాణించి.. అక్కడ నుంచి రైలులో ప్రయాణించి అంకలేశ్వర్‌కు చేరుకుంటారు. 

ఆ తర్వాత అక్కడ స్టేషన్‌ నుంచి ఫ్యాక్టరీకి మరో నాలుగు కి.మీ సైకిల్‌ తొక్కాల్సి ఉంటుంది. అయినా సరే ఆయన సైక్లింగ్‌ వదిలేయలేదు. దాదాపు మూడు దశాబ్దాలుగా ఆయన ఇదే జీవన విధానాన్ని అనుసరిస్తున్నారు. 1990లలో రూ. 2000 పెట్లి అట్లాస్‌ కంపెనీ సైకిల్‌ కొనుకున్నారు. ఇప్పటికీ దానిపైనే ప్రయాణించడం చూస్తే.. ఆ సైకిల్‌ని ఆయన ఎంతలా అపురూపంగా చూసుకుంటున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది. 

ఇక ఆయనది ఉమ్మడి కుటుంబం. మొత్తం 22 మంది కుటుంబ సభ్యులు ఉంటారు. జరివాలాకు నలుగురు సోదరులు. వారిలో చిన్నవాడు ఆయనే. పెద్ద అన్న వయసు 80 ఏళ్లు. చిన్న మనవడికి మూడేళ్లు. ఆయన క్రమశిక్షణతో కూడిన ఆరోగ్యకరమైన జీవిన విధానం తమకు స్ఫూర్తి, ఆరాధ్యనీయమైనదని చెబుతున్నారు కుటుంబసభ్యులు. ఆయనను అనుసరించడానికి ప్రయత్నిస్తున్నామని, కానీ మావల్ల సాధ్యం కావడం లేదని అంటున్నారు వారంతా. 

ఇంత బిజీ లైఫ్‌లో కూడా ఆయన రోజూ 10వేల అడుగులపైగా వాకింగ్‌​ చేస్తాడట. మారథాన్‌, రన్నింగ్‌ రేస్‌ వంటి అన్నింటిల్లోనూ పాల్గొటాడట. మరో విశేషం ఏంటంటే.. మహారాష్ట్రలోని షిర్డీకి సుమారు 300 కిలోమీట‌ర్లు సైకిల్‌పైనే వెళ్తాడట సురేష్ జరివాలా. ఆయన జీవిన విధానం పర్యావరణ హితంగానూ ఆరోగ్యప్రదంగానూ ఉంది. చెప్పాలంటే క్రమశిక్షణాయూతంగా జీవించడానికి ఉదాహరణ సురేష్ జరివాలా జీవన విధానం. కనీసం ఆయనలా అంతలా చేయలేకపోయినా..పర్యావరణానికి మేలు కలిగించేలా, ఆరోగ్యగా ఉండేలా జీవించడానికి కొద్ది ప్రయత్నమైనా చేద్దామా..!

(చదవండి:  'డయాబెటిక్ రైస్' అంటే..? బాలీవుడ్‌ నటుడు గోవింద్‌ వైఫ్‌ సైతం..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement