నెయిల్‌ కట్టర్‌ కథ తెలుసా? | The Story of the Creation of Nail Clippers | Sakshi
Sakshi News home page

నెయిల్‌ కట్టర్‌ కథ తెలుసా?

Mar 14 2026 12:34 PM | Updated on Mar 14 2026 12:40 PM

The Story of the Creation of Nail Clippers

పిల్లలూ! మీ గోళ్లు పెరిగితే స్కూల్లో టీచర్లు కోప్పడతారు. గోళ్లు పెంచుకోవడం, కొరకడం చెడ్డ అలవాట్లని చెప్తారు. నెయిల్‌ కట్టర్‌తో గోళ్లు తీసుకుని స్కూల్‌కి రమ్మంటారు. మరి ఈ నెయిల్‌ కట్టర్‌ కథేమిటో మీకు తెలుసా? నెయిల్‌ కట్టర్‌ని కొన్ని చోట్ల ‘నెయిల్‌ క్లిప్పర్‌’ అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఇది స్టెయిన్‌ లెస్‌ స్టీల్‌తో తయారు చేస్తారు. ప్టాస్టిక్, అల్యూమినియంతో తయారు చేసినవి కూడా మార్కెట్లో లభిస్తాయి. గోళ్ల గరుకు అంచులను  సున్నితంగా చేయడానికి నెయిల్‌ కట్టర్‌ వెనక వైపు ఫైల్‌ ఉంటుంది. కొన్ని నెయిల్‌ కట్టర్లు నెయిల్‌ క్యాచర్‌తో వస్తాయి.

నెయిల్‌ కట్టర్‌ తయారు చేయడానికి ముందు ప్రజలు తమ గోళ్లను కత్తిరించడానికి చిన్న కత్తులను ఉపయోగించేవారు. గోళ్లు కత్తిరించడం అనే ఆచారం గురించి మతగ్రంథాల్లో కూడా ప్రస్తావించారు. క్రీ.పూ రాసిన గ్రంథాల్లో గోళ్లు కత్తిరించడం గురించి రాసి ఉంది. అయితే ఇందుకోసం ప్రత్యేక సాధనమేమీ ఉండేది కాదు. చిన్నకత్తులతోనే గోళ్లు తీసుకునేవారు. ఆధునిక కాలంలో నెయిల్‌ కట్టర్‌పై మొదటి పేటెంట్‌ను 1875లో వాలెంటైన్‌ ఫోగెర్టీ ఫొందారు. అనంతరం 1876లో విలియం సి.ఎడ్జ్, 1878లో జాన్‌ హెచ్‌. హోల్మాన్‌ ఆ నమూనాను మరింత అభివృద్ధి చేశారు. ఆపై అనేకమంది దీని మీద ప్రయోగాలు చేసి ఇప్పుడున్న నమూనాను స్థిరపరిచారు. మొదట్లో ఇవి కేవలం కొందరి ఇళ్లకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం మార్కెట్లో ఇవి విరివిగా దొరుకుతున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement