
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ రైడ్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహించిన క్రైమ్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఇవాళ విడుదలైంది. ఈ సినిమాను 2018లో వచ్చి రైడ్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కించారు. ఈ మూవీలో హీరోయిన్‌గా వాణి కపూర్ నటించింది.
ఈ నేపథ్యంలో అజయ్ దేవగణ్ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. తనపై వస్తున్న రూమర్స్‌పై కూడా స్పందించారు. బాలీవుడ్‌లో మీరు తొలి ప్రైవేట్ జెట్‌ను కొనుగోలు చేశారన్న దానిపై అజయ్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి అదేం లేదని.. కానీ దానిని కొనాలని ప్లాన్ చేస్తున్నా.. ఒక ఒప్పందం కూడా చేసుకున్నా. కానీ చివరికీ అది జరగలేదంటూ అజయ్ క్లారిటీ ఇచ్చారు. అజయ్ దేవగణ్ సొంతం ప్రైవేట్ జెట్ కొనుగోలు చేశారని బాలీవుడ్‌లో చాలా కాలంగా టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన స్పందించారు.
తాజాగా విడుదలైన రైడ్-2 రైమ్ థ్రిల్లర్‌లో అజయ్ దేవగణ్ ఐఆర్‌ఎస్ అధికారి పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో రితేష్ దేశ్‌ముఖ్ ప్రతినాయకుడిగా నటించారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, కుమార్ మంగత్ పాఠక్ అభిషేక్ పాఠక్ సంయుక్తంగా నిర్మించారు.