మృతదేహం వెలికితీసి పోస్టుమార్టంతో.. అసలు నిజాలు..! | - | Sakshi
Sakshi News home page

మృతదేహం వెలికితీసి పోస్టుమార్టంతో.. అసలు నిజాలు..!

Aug 10 2023 6:52 AM | Updated on Aug 10 2023 9:47 AM

- - Sakshi

వరంగల్‌: హనుమకొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధి లోని బొక్కలగడ్డ ఈద్గాలో బుధవారం ఉదయం గత నెల 12న పూడ్చి పెట్టిన మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. సీఐ కరుణాకర్‌ కథనం ప్రకారం హనుమకొండ గుడిబండల్‌ ప్రాంతానికి చెందిన షహనజ్‌కు ఇద్దరు కుమార్తెలు, ఇద్ద రు కుమారులు.

పెద్ద కుమార్తె కాజోల్‌ (20)వీణాబజార్‌లో ఓ బట్టల షాపులో పనిచేస్తోంది. కాజోల్‌ అంబాల గ్రామానికి చెందిన అబ్బాస్‌తో ఆరు సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో పెండ్లి విషయంలో కాజల్‌, అబ్బాస్‌కు గొడవలు జరిగాయి. ఇదిలా ఉండగా అనారోగ్య కారణాల రీత్యా గత నెల 12న కాజోల్‌ను ఎంజీఎంలో అడ్మిట్‌ చేయగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

అదే రోజు రాత్రి అబ్బాస్‌ బొక్కలగడ్డ ఈద్గాలో కాజోల్‌ మృతదేహం పూడ్చిపెట్టాడు. ఈ ఘటనపై మృతురాలి తండ్రి షహనజ్‌ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి హనుమకొండ తహసీల్దార్‌ సమక్షంలో కేఎంసీ ఫోరెన్సిక్‌ వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించినట్లు సీఐ తెలిపారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా నిందితుడిపై చర్యలు తీసుకుంటామని సీఐ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement