వైద్యం మరింత మెరుగు | - | Sakshi
Sakshi News home page

వైద్యం మరింత మెరుగు

Aug 12 2026 1:22 AM | Updated on Aug 12 2026 1:22 AM

రూ.1.61 కోట్లతో సర్జికల్‌ సామగ్రి సర్జరీ, ప్రసూతి విభాగాలకు ప్రాధాన్యం ఎన్‌ఎంసీ ప్రమాణాలకు.. క్యాజువాల్టీ, ఓటీకి కీలక పరికరాలు జనరల్‌ మెడిసిన్‌కు.. పెండింగ్‌ ఇంప్లాంట్ల బిల్లులకు.. టెండర్ల తర్వాతే కొనుగోళ్లు

ఆరోగ్యశ్రీ నిధులతో జిల్లా ఆస్పత్రికి మహర్దశ

జనగామ: ఆరోగ్యశ్రీ సేవల ద్వారా జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి సమకూరిన 10 శాతం రివాల్వింగ్‌ ఫండ్‌ నుంచి రూ.2,44,49,600లను ఆస్పత్రి అవసరాలకు వినియోగించనున్నారు. ఈ నిధులతో ఏయే పరికరాలు కొనుగోలు చేయాలి.. ఎన్ని సంఖ్యలో అవసరం.. ఎంత మొత్తాన్ని కేటాయించాలనే దానిపై వైద్య విద్యాశాఖ (డీఎంఈ) నుంచి అధికారికంగా జాబితా అందింది. ఇందులో సర్జికల్‌ ఎక్విప్‌మెంట్‌, ఎన్‌ఎంసీ నిబంధనలకు అవసరమైన పరికరాలు, సర్జికల్‌ ఇంప్లాంట్ల పెండింగ్‌ బిల్లులు ఉన్నాయి.

నిధుల్లో రూ.1,61,25,000లను సర్జికల్‌ ఎక్విప్‌మెంట్‌కు కేటాయించారు. ఆర్థోపెడిక్స్‌ విభాగానికి ఒక పాలీట్రామా సెట్‌, రెండు ఆర్థోపెడిక్‌ సెట్లు కొనుగో లు చేయనున్నారు. ఒక్కో ఆర్థోపెడిక్‌ సెట్‌లో 16 ప రికరాలు ఉంటాయి. ఆప్తాల్మాలజీ విభాగానికి రెండు ఆప్తాల్మిక్‌ సెట్లు, ఒక్కో సెట్‌లో 17 పరికరాలు, అలాగే ఒక క్యాటరాక్ట్‌ సెట్‌ సమకూర్చనున్నారు.

సర్జరీ విభాగానికి అన్ని సర్జికల్‌ బ్రాంచ్‌లలో సాధారణంగా ఉపయోగించే 67 పరికరాలతో కూడిన రెండు సెట్లు కొనుగోలు చేయనున్నారు. ప్రసూతి, సీ్త్రల వైద్య విభాగానికి రెండు ఓబీజీ సెట్లు అందనున్నాయి. ఒక్కో సెట్‌లో 25 పరికరాలు ఉంటాయి. ఈఎన్‌టీ విభాగానికి 11 పరికరాలతో కూడిన రెండు సెట్లు, అనస్థీషియా విభాగానికి 23 పరికరాలతో ఒక సెట్‌, బేసిక్‌ డెంటల్‌ విభాగానికి 16 పరికరాలతో రెండు సెట్లు కొనుగోలు జాబితాలో ఉన్నాయి.

ఆస్పత్రిలో జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) ప్రమాణాలకు అవసరమైన పరికరాల కోసం రూ.82లక్షలు కేటాయించారు. రేడియాలజీ విభాగానికి ఒక సీఆర్‌ సిస్టమ్‌, జీజీహెచ్‌ ఫర్నిచర్‌ విభాగానికి ఒక ఈటీఓ స్టెరిలైజర్‌, అనస్థీషియాకు సీ–ఆర్మ్‌కు అనుకూలమైన ఒక ఓటీ టేబుల్‌ కొనుగోలు చేయనున్నారు.

సైకియాట్రీ విభాగానికి ఈసీజీ, ఈఈజీ మానిటరింగ్‌తో కూడిన ఒక ఎలక్ట్రో కన్వల్సివ్‌ థెరపీ (ఈసీటీ) మెషీన్‌, ప్రసూతి విభాగానికి రెండు ఎన్‌ఎస్‌టీ మెషీన్లు, అనస్థీషియాకు రెండు ఈసీజీ మెషీన్లు సమకూర్చనున్నారు. సెంట్రల్‌ క్యాజువాల్టీ విభాగా నికి ఒక ఆటోక్లేవ్‌, ఒక మొబైల్‌ 100 ఎంఏ ఎక్స్‌రే, ఒక ఆపరేషన్‌ థియేటర్‌ టేబుల్‌, రెండు ఓటీ సీలింగ్‌ లైట్లు, ఒక ఎలక్ట్రో సర్జికల్‌ కాటరీ యూనిట్‌ కొనుగోలు చేయనున్నారు.

జనరల్‌ మెడిసిన్‌ విభాగానికి రెండు పెడెస్టల్‌ లైట్లు, ఒక ఆర్టీరియల్‌ బ్లడ్‌ గ్యాస్‌ అనలైజర్‌, రెండు సీపాప్‌ మెషీన్లు, రెండు డీఫిబ్రిలేటర్లు, రెండు ఫొటోథెరపీ యూనిట్లు, రెండు ఆప్తాల్మోస్కోపులు, రెండు పల్స్‌ ఆక్సీమీటర్లు, రెండు లారింగోస్కోపులు సమకూర్చనున్నారు. ఈ పరికరాలు అత్యవసర, సాధారణ వైద్య సేవల్లో ఉపయోగపడనున్నాయి. ఈఎన్‌టీకి రెండు టాన్సిలెక్టమీ–అడినాయి డెక్టమీ సెట్లు, ఆర్థోపెడిక్స్‌కు ఒక కాటరీ మెషీన్‌న్‌ కూడా జాబితాలో ఉన్నాయి.

సర్జికల్‌ ఇంప్లాంట్లకు సంబంధించిన పెండింగ్‌ బిల్లుల చెల్లింపుల కోసం రూ.1,24,600 కేటాయించారు. దీంతో సర్జికల్‌ పరికరాలకు రూ.1,61,25,000, ఎన్‌ఎంసీ కంప్లయన్స్‌ పరికరాలకు రూ.82లక్షలు, పెండింగ్‌ బిల్లులకు రూ.1,24, 600 కలిపి రూ.2,44,49,600 ఖర్చుతో పరికరాలు కొనుగోలు చేయనున్నారు.

డీఎంఈ నుంచి వచ్చిన అధికారిక జాబితా ఆధారంగా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ అవసరాల వివరాలను కలెక్టర్‌కు సమర్పించనున్నారు. అనంతరం కలెక్టర్‌ ఆదేశాల మేరకు నిబంధనల ప్రకారం టెండర్ల ప్రక్రియ నిర్వహించి ఎంపికై న సంస్థల నుంచి పరికరాలు కొనుగోలు చేయనున్నారు.

రూ.2.44 కోట్ల రివాల్వింగ్‌ ఫండ్‌

సర్జరీల నుంచి అత్యవసర సేవల వరకు

సర్జికల్‌ పరికరాలు, ఎన్‌ఎంసీ

ప్రమాణాల సామగ్రి కొనుగోలుకు ప్రతిపాదనలు

కలెక్టర్‌ ఆదేశాలతో టెండర్ల ప్రక్రియ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement