పీహెచ్‌సీలో పరిశుభ్రత ఏది..? | - | Sakshi
Sakshi News home page

పీహెచ్‌సీలో పరిశుభ్రత ఏది..?

Aug 12 2026 1:22 AM | Updated on Aug 12 2026 1:22 AM

రఘునాథపల్లి: మండలంలోని కోమల్ల ఆరోగ్య కేంద్రం పరిసరాలు, వార్డు, రోగులు వేచి ఉండే ప్రదేశాలు, ఇతర గదుల్లో అపరిశుభ్రంగా ఉండటంపై కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగులకు చికిత్స అందించే ఆరోగ్య కేంద్రంలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఎక్క డా, చెత్త, దుమ్ము, అపరిశుభ్రత కనిపించకుండా చూడాలని పంచాయతీ కార్యదర్శి యాకుబ్‌ను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్‌ కోమల్ల ఆరోగ్య కేంద్రాన్ని, ప్రాథమిక పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రిలో వైద్యసేవలు, సిబ్బంది హాజరు, మందుల నిల్వలు, పారిశుద్ధ్యం, నీటి సరఫరా తదితర అంశాలను పరిశీలించారు. ముందుగా ఇన్‌పెషెంట్‌ వార్డుతో పాటు ఓపీ రిజిస్టర్‌ను తనిఖీ చేసి న కలెక్టర్‌..విధులకు హాజరైన, గైర్హాజరైన సిబ్బంది వివరాలపై ఆరా తీశారు. పీహెచ్‌సీలో నీటి ఎద్దడిపై స్పందించిన కలెక్టర్‌ వచ్చే శనివారం నాటికి ఆరోగ్య కేంద్రంలో పూర్తిస్థాయిలో నీటి సరఫరా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ప్రాథమిక పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ వల్లాల అశోక్‌, పీహెచ్‌సీ వైద్యులు ఇంజమాన్‌, సిబ్బంది పాల్గొన్నారు.

విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక శ్రద్ధ

జనగామ రూరల్‌: జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఎంఈఓలు, కాంప్లెక్స్‌ హెడ్‌మాస్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల కేటాయింపు ఉండేలా వర్క్‌ అడ్జస్ట్‌మెంట్‌ ప్రక్రియను చేపట్టాలని సూచించారు. ‘మిషన్‌ శిఖరం’ కార్యక్రమం కింద జిల్లాలోని ప్రతీ పాఠశాల పరిస్థితిపై స్పష్టమైన నివేదిక వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించేలా పకడ్బందీగా రూపొందించాలని ఆదేశించారు. అన్ని పాఠశాలలకు ఇంటర్నెట్‌ సౌకర్యం అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ‘ఫాస్ట్‌ మ్యాథ్స్‌’ పుస్తకాలను విద్యార్థులతో నిరంతరం సాధన చేయించాలని సూచించారు. సమీక్షలో విద్యాశాఖ ఏడీ శ్రీనివాస్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అధికారులపై కలెక్టర్‌

సందీప్‌ కుమార్‌ ఝా ఆగ్రహం

కోమల్ల ఆరోగ్య కేంద్రం, పాఠశాలలో ఆకస్మిక తనిఖీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement