స్టేషన్‌ఘన్‌పూర్: అధిక నీరు అవసరమయ్యే వరి తదితర పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగ య్యే ప్రత్యామ్నాయ పంటలు వేయాలని డీఆర్‌డీఓ భాస్కర్ సూచించారు. డివిజన్ కేంద్రంతో పాటు మండలంలోని చంద్రుతండా, తాటికొండ, విశ్వనాధపురం, ఇప్పగూడెం, కోమటిగూడెం గ్రామాల్లో వ్యవసాయశాఖ వారి ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా తాటికొండలో సమావేశానికి ముఖ్య అతిథిగా డీఆర్‌డీఓ హాజరై మాట్లాడారు.. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం, సాగునీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటలు వేసుకోవాలన్నారు. రైతులు పొలాల వద్ద ఫాంపౌండ్‌లను ఏర్పాటు చేసుకోవాలని, ఇళ్ల వద్ద ఇంకుడుగుంతల నిర్మాణం చేసుకోవాలని సూచించారు. ఆయా సమావేశాల్లో ఏడీఏ అపర్ణ, మండల వ్యవసాయ అధికారి కరుణాకర్, సర్పంచ్‌లు భూక్య అరుణరాంసింగ్, మందపురం రాణిఅనీల్, మారపాక సుజనశ్రీను, గుర్రపు యాదమ్మఎల్లయ్య, కార్యదర్శులు యుగేందర్, రమేష్, మాధవ్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
డీఆర్‌డీఓ భాస్కర్


