నేడు డయల్‌ యువర్‌ డీఎం | - | Sakshi
Sakshi News home page

నేడు డయల్‌ యువర్‌ డీఎం

Aug 12 2026 1:22 AM | Updated on Aug 12 2026 1:22 AM

మొదలైన మెడికో విద్యార్థిని ప్రీతి కేసు విచారణ

జనగామ రూరల్‌: ఈనెల 12న (బుధవారం) డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమం ఉంటుంద ని జనగామ డీఎం ఎం.ఉష మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిపో పరిధిలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉదయం 11గంటల నుంచి 12గంటల వరకు ఉంటుందని, 9959226050 ఫోన్‌ నంబర్‌కు కాల్‌ చేయాలని సూచించారు.

ప్రత్యామ్నాయ పంటలపై ముగిసిన గ్రామసభలు

జనగామ రూరల్‌: ప్రత్యామ్నాయ పంటలు, పంట కుంటల ఆవశ్యకత, పండ్ల తోటల పెంపకంపై రైతులకు అవగాహన కల్పించేందుకు నిర్వహించిన మూడు రోజుల గ్రామసభలు విజయవంతంగా ముగిశాయని వ్యవసాయ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పండ్ల తోటల ఏర్పాటుకు రైతులు గ్రామసభలో దరఖాస్తు చేశారని, ఆసక్తి ఉన్న రైతులు వ్యవసాయ విస్తరణ అధికారులకు సంబంధిత వివరాలు అందజేయాలని కోరారు. ఈ నెల 20 నుంచి ఫ్రేంవర్క్‌ ఫర్‌ ఫర్టిలైజర్‌ సేల్‌ అనే యాప్‌ జిల్లాలో అమలు జరుగుతుందన్నారు.

ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

జనగామ రూరల్‌: ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆటో యూనియన్‌ రాష్ట్ర అ ధ్యక్షుడు మంద రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. జిల్లా అధ్యక్షుడు జేరిపోతుల కుమార్‌ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో మంగళవారం ఆటోలతో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం కలెక్టరే ట్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఓలా, ఉబర్‌, రాపిడోను నిషేధించి ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోయిన డ్రైవర్లకు ఏడాదికి రూ.12,000 మెయింటనెన్స్‌ ఇవ్వాలన్నారు. నిరసనలో బూడిద ప్రశాంత్‌, నల్ల మల్లయ్య అడ్డూరి శ్రీనివాస్‌, కొల్లూరు మల్లయ్య, బోయిని లింగమూర్తి, ఉస్మాన్‌, గోపగాని రవి, చీర కుమార్‌, కందుల రాజు, నోముల శ్రీని వాస్‌, మంగ శ్రీనివాస్‌, కంత్రి రాజు, రాజు, నామాల భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

హక్కులు, బాధ్యతలను తెలుసుకోవాలి

వరంగల్‌ క్రైం: రాజ్యాంగం కల్పించిన హక్కులతోపాటు పౌరులు బాధ్యతలను కూడా తెలుసులకోవాలని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌.శ్వేత సూచించారు. హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ‘హర్‌ ఘర్‌ తిరంగా’పై రెండు రోజుల ఇంటిగ్రేటెడ్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ ఔట్రీచ్‌ ప్రోగ్రాం, ఫొటో ఎగ్జిబిషన్‌ను సీపీ, కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ మంగళవారం ప్రా రంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ స్వేచ్ఛ, ప్రజా స్వామ్యం, రాజ్యాంగ విలువలను కాపాడడంతోపాటు దేశ అభివృద్ధిలో యువత క్రియాశీలకంగా భాగస్వాములు కావాలని కోరారు. ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ జి.శ్రీనివాస్‌, వైస్‌ ప్రిన్సి పాల్‌ రజినీలత, ప్రోగ్రాం ఇన్‌చార్జ్‌ సమత, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

వరంగల్‌ లీగల్‌ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాకతీయ మెడికల్‌ కాలేజీ (కేఎంసీ) విద్యార్థిని ప్రీతి హత్య కేసు విచారణ హనుమకొండ ఎస్సీ, ఎస్టీ కోర్టులో ప్రారంభమైంది. కేసు విచారణ షెడ్యూల్‌ మంగళవారం నుంచి ఐదు మాసాల వరకు నిర్ణయించారు. మొత్తం 99మంది సాక్షులను విచారించనున్నారు. మొదటి రోజు మృతురాలి తండ్రిని విచారించారు. 2023లో మృతి చెందిన మెడికో ప్రీతి హత్య విషయమై నాడు పీజీ విద్యార్థి అయిన మహ్మద్‌ షఫీని నిందితుడిగా భావించి కాలేజీ నుంచి తొలగించిన విషయం విదితమే. విచారణను ఎస్సీ, ఎస్టీ కోర్డు జడ్జి పద్మజ బుధవారానికి వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement