రఘునాథపల్లి: ఓటర్ జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ మొదటి దశలో నియోజకవర్గం రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచిందని, నాయకులు, కార్యకర్తల కృషి వల్లే ఇది సాధ్యమైందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం మండలంలోని నిడిగొండ సమీపంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఎస్‌ఐఆర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ లింగాల జగదీష్‌చందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ పార్టీ స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ విస్లృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.. ముసాయిదా జాబితా ప్రకటన అనంతరం అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ, అవసరమైన వారి నుంచి గుర్తింపు కార్డులు, ధ్రువపత్రాల సమర్పణలోనూ కీలకంగా వ్యవహరించి రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచేలా చూడాలని సూచించారు. అర్హులైన ఏ ఒక్కరి పేరు జాబితా నంచి తొలగించకుండా చూడాలన్నారు. నియోజకవర్గంలోని 291 బూత్‌లకు ఒక్కో బూత్‌కు 10 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తానని, 10 రోజుల్లో అర్హులైన వారి లబ్ధిదారుల జాబితా సర్పంచ్‌లు, అధ్యక్షులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ దన్వంతి, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య, మాజీ జెడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు గాదె మహేందర్‌రెడ్డి, కోళ్ల రవిగౌడ్, లింగాజీ, మేకల నరేందర్, కావటి భాస్కర్‌యాదవ్, లోనె శ్రవణ్‌కుమార్, గొరిగ రవి, ఈశ్వరయ్య, సర్పంచ్‌లు, బీఎల్‌ఏలు, నాయకులు పాల్గొన్నారు.
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి


