ఒకే హీరోతో డేటింగ్ చేశాం: ఇద్దరు స్టార్‌ హీరోయిన్లు | Kajol & Twinkle Khanna Reveal They Dated the Same Actor on ‘Two Much’ Talk Show | Sakshi
Sakshi News home page

ఒకే హీరోతో డేటింగ్ చేశాం: ఇద్దరు స్టార్‌ హీరోయిన్లు

Nov 15 2025 12:28 PM | Updated on Nov 15 2025 12:38 PM

Twinkle Khanna and kajol reveals her ex boyfriend in common

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ కాజోల్‌ (Kajol), ట్వింకిల్‌ ఖన్నా (Twinkle Khanna) వ్యాఖ్యాతలుగా  కొనసాగుతున్న సెలబ్రిటీ టాక్‌ షో ‘టూ మచ్‌’ (Two Much) గురించి సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.  ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video)లో  తాజాగా విడుదలైన ఎపిసోడ్‌లో వారిద్దరూ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

గతంలో వీరిద్దరు ఒకేసారి.. ఒకే హీరోతో డేటింగ్ చేసినట్లు  షాకింగ్‌ విషయాన్ని చెప్పుకొచ్చారు. అయితే, అదంతా తమ పెళ్లికి ముందేనంటూ క్లారిటీ ఇచ్చారు. గతంలో ఇలాంటి సీక్రెట్స్‌ చెప్పాలంటే ఎవరైనా కాస్త ఆలోచించేవారు. అయితే, ప్రస్తుతం చాలా సింపుల్‌గా బహిరంగంగా మాట్లాడేస్తున్నారు. వారిద్దరితో డేటింగ్‌ చేసిన ఆ హీరో ఎవరంటూ సోషల్‌మీడియాలో  చర్చలు మొదలయ్యాయి. కొందరు అభిషేక్ కపూర్ అంటూ కామెంట్‌ చేస్తే ఇంకొందరు మాత్రం అక్షయ్ కమార్ అని పోస్టులు పెడుతున్నారు. ఏదేమైనా వారిద్దరూ మాత్రం నిజ జీవితంలో వేరువేరు వ్యక్తులను  పెళ్లి చేసుకున్నారనేది నిజం.  కాజోల్ అజయ్ దేవగన్‌ను పెళ్లి చేసుకుంటే.. ట్వింకిల్ ఖన్నా మాత్రం అక్షయ్‌ను వివాహం చేసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement