‘నా పిల్లలు నా సినిమాలు చూడరు’ | Kajol Said Both My Children Do Not Like My Movies | Sakshi
Sakshi News home page

‘నా పిల్లలు నా సినిమాలు చూడరు’

Oct 16 2018 7:01 PM | Updated on Oct 16 2018 7:01 PM

Kajol Said Both My Children Do Not Like My Movies - Sakshi

కాజోల్‌ - అజయ్‌ దేవ్‌గన్‌(ఫైల్‌ ఫోటో)

నా పిల్లలు నా సినిమాలు చూడరంటున్నారు బాలీవుడ్‌ నటి కాజోల్‌. ఓ టెలివిజన్‌ షోలో పాల్గొన్న కాజోల్‌ పలు ఆసరక్తికర ఆంశాల గురించి మాట్లాడారు. ‘నా పిల్లలు నా సినిమాలు అస్సలు చూడరు. అందుకు వాళ్లు చెప్పే కారణం సినిమాల్లో నేను ఎక్కువగా ఏడుస్తూ ఉంటానంట. అందుకే నా సినిమాలు చూడరు. ‘గోల్‌మాల్‌’ లాంటి సినిమాలు వాళ్లకి ఇష్టం’ అంటూ చెప్పుకొచ్చారు కాజోల్‌.

పిల్లల విషయంలో ఎవరూ కఠినంగా ఉంటారని అడగ్గా.. పిల్లల విషయంలో అజయ్‌ కాస్తా నయం. నేను మాత్రం వారిని ఎల్లప్పుడు కనిపెట్టుకునే ఉంటాను. వారికి కావాల్సిన స్వేచ్ఛను ఇస్తూనే వారిని హద్దుల్లో ఉంచుతాను. అయినా నా పిల్లలిద్దరూ చాలా మంచివారు. అమ్మ చెప్పిన విషయాలను అర్థం చేసుకుంటారు అని తెలిపారు. ‘మీ కూతురు నైసా సినిమాల్లోకి వస్తానంటే మీరు ఒప్పుకుంటారా’ అని ప్రశ్నించగా ‘కెరియర్‌ విషయంలో నా పిల్లల మీద ఎలాంటి ఒత్తిడి ఉండదు. వారికి నచ్చిన రంగంలోనే వారు ఉన్నతంగా రాణించాలని కోరుకుంటాను’ అని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement