Bollywood Actress Kajol Controversy Comments On Political Leaders - Sakshi
Sakshi News home page

Kajol: 'అది నా ఉద్దేశం కాదు.. కామెంట్స్‌పై కాజోల్ క్లారిటీ'

Jul 9 2023 5:04 PM | Updated on Jul 31 2023 8:07 PM

Bollywood Actress Kajol Controversy Comments On Political Leaders - Sakshi

కాజోల్‌.. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసే స్టార్‌ హీరోయిన్లలో ఒకరు. ఎలాంటి కష్టతరమైన పాత్రలోకి అవలీలగా పరకాయ ప్రవేశం చేసి తన నటనా పటిమను చాటుకున్న బ్యూటీఫుల్‌ హీరోయిన్‌ ఆమె. 17 ఏళ్ల వయసులో 1992లో విడుదలైన 'బేఖుడి' చిత్రంతో సినీ రంగానికి పరిచయమైంది బ్యూటీఫుల్‌ కాజోల్‌.

కుచ్‌ కుచ్‌ హోతా హై, దిల్వాలే దుల్హానియే లేజాయింగే, ఫనా, బాజీగర్, దుష్మన్‌, త్రిభంగ, కరణ్‌ అర్జున్‌, మెరుపు కలలు, వీఐపీ 2 వంటి తదిర సినిమాలతో ఎంతో పేరు తెచ్చుకుంది. ఇటీవలే లస్ట్ స్టోరీస్‌-2 వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది.  అయితే తాజాగా కాజోల్‌ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె రాజకీయ నేతలపై చేసిన వ్యాఖ్యల వివాదానికి దారితీశాయి.

(ఇది చదవండి: మీరు 'గే' కదా?.. ప్రముఖ డైరెక్టర్‌కు షాకిచ్చిన నెటిజన్!)

ఇంతకీ ఆమె ఏమన్నారంటే?

ప్రస్తుతం కాజోల్‌  ‘ది ట్రైల్‌ ప్రాజెక్ట్‌లో నటిస్తోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మహిళా సాధికారిత గురించి మాట్లాడారు. మనదేశంలో మార్పు చాలా నెమ్మదిగా జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం మన సంప్రదాయాలు, ఆలోచన విధానాలే. ఇదే మన విద్యపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అంతే కాకుండా మన విద్యావ్యవస్థపై సరైన అవగాహన లేని రాజకీయ నాయకులు ఉన్నారు. మనల్ని పాలించే చాలామంది నేతలకు విద్యా విధానంపై అవగాహన లేదని అన్నారు. దీంతో ఆమె వ్యాఖ్యలను పలువురు రాజకీయ నాయకులు ఖండించారు. 

అయితే ఈ వ్యాఖ్యల పట్ల కాజోల్ వివరణ కూడా ఇచ్చింది. ఈ మేరకు ట్విటర్‌లో పోస్ట్ చేసింది. నేను కేవలం విద్య, దాని ప్రాముఖ్యత గురించి మాత్రమే ఒక పాయింట్ అవుట్ చేసి మాట్లాడాను. ఇందులో నా ఉద్దేశ్యం  రాజకీయ నాయకులను కించపరచడం కాదు. దేశాన్ని సరైన మార్గంలో నడిపించే కొంతమంది గొప్ప నాయకులు కూడా మనకు ఉన్నారని చెప్పుకొచ్చారు. కాగా.. 1999లో ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది.  

(ఇది చదవండి: 'సలార్' అప్డేట్.. స్టార్ కమెడియన్ అలా అనడంతో!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement