
బాలీవుడ్ నటి స్వర భాస్కర్ మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో ఛావా సినిమాపై బాలీవుడ్ నటి స్వర భాస్కర్ చేసిన ట్వీట్స్ వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. ఎప్పుడు ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే స్వరభాస్కర్ తాజాగా అలాంటి కామెంట్లతో మరోసారి చర్చనీయాంశంగా మారింది.
తన భర్త ఫహద్ ఆహ్మద్తో కలిసి పతి పత్ని ఔర్ పంగా - జోడియోం కా రియాలిటీ చెక్ అనే రియాలిటీ షోకు హాజరైన బాలీవుడ్ భామ లైంగిక జీవితంపై సంచలన కామెంట్స్ చేసింది. ప్రతి ఒక్కరూ బై సెక్సువల్ అంటూ వ్యాఖ్యానించింది. అంతేకాకుండా తనకు సమాజ్వాది పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ అంటే క్రష్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవలే ఆమెను కలిశానని కూడా తెలిపింది.
జెండర్ అనేది వేల ఏళ్లుగా మనపై బలవంతంగా రుద్దబడిన భావజాలమంటూ స్వర భాస్కర్ మాట్లాడింది. ఇవీ కాస్తా నెట్టింట వైరల్ కావడంతో పలువురు ఆమెపై మండిపడుతున్నారు. దీంతో తన మాటలతో మరోసారి వివాదానికి కేరాఫ్ అడ్రస్గా మారింది స్వర భాస్కర్. కాగా.. స్వర భాస్కర్ హిందీలో తను వెడ్స్ మను, రాంఝనా, ప్రేమ్ రతన్ ధన్ పాయో లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.
"Everyone is Bisexual. I have a crush on Dimple Yadav"
Swara Bhaskar 💀
Now I am feeling bad for Akhilesh Yadav and Swara's husband 🤣pic.twitter.com/JVc1z12w7n— Sunanda Roy 👑 (@SaffronSunanda) August 18, 2025