
బాలీవుడ్ ఫేమస్ జంటల్లో అజయ్ దేవగణ్, కాజోల్ ఒకరు. తాజాగా ఈ జంట తమ 26వ వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా తన భార్యకు అజయ్ దేవగణ్ మ్యారేజ్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఆమెతో దిగిన పాత ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. '26 ఏళ్లుగా ఈ ట్రెండ్‌ను అధిగమిస్తున్నాం.. మనిద్దరికీ హ్యాపీ యానివర్సరీ' అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సన్నిహితులు స్టార్ జంటకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
కాగా.. మొదట వీరిద్దరు 1995లో వచ్చిన హల్‌చల్ అనే మూవీ సెట్స్‌లో కలుసుకున్నారు. ఆ తర్వాత కూడా పలు సూపర్ హిట్ చిత్రాల్లో జంటగా కనిపించారు. అదేక్రమంలోనే అజయ్, కాజోల్ ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లు డేటింగ్ చేసిన తర్వాత 1999లో ఓ ప్రైవేట్ వేడుకలో పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. వీరిద్దరు ఇష్క్, ప్యార్ తో హోనా హి థా, యు మే ఔర్ హమ్, తాన్హాజీ: ది అన్‌సంగ్ వారియర్ లాంచి చిత్రాలలో జంటగా నటించారు. వీరిద్దరి నైసా దేవగణ్, యుగ్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా.. ఇక సినిమాల విషయానికొస్తే కాజోల్ చివరిసారిగా దో పట్టిలో కనిపించింది. మరోవైపు అజయ్ దేవగణ్ చివరిసారిగా రోహిత్ శెట్టి తెరకెక్కించిన సింగం ఎగైన్‌లో కనిపించారు.