
బుల్లితెర ప్రియులను అలరిస్తోన్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్బాస్. ఈ షోకు ఫ్యాన్స్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రత్యేకంగా ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో మరో సీజన్ బుల్లితెర ప్రియులను అలరించేందుకు వస్తోంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎవరనేది దాదాపు ఖరారు కాగా.. ఈనెల 24 బిగ్బాస్ సీజన్-19 షురూ కానుంది. ఈ ఏడాది కూడా స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్గా వ్యవహరిస్తున్నారు.
అయితే ఈ సీజన్లో స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే గెస్ట్గా వస్తారని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. తాను హోస్ట్గా వ్యవహరిస్తోన్న కొత్త రియాలిటీ షో 'పతి పత్నీ ఔర్ పంగా' ప్రమోషన్స్ కోసం బిగ్బాస్ హౌస్లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా.. సోనాలి బింద్రే, సల్మాన్ ఖాన్తో 'హమ్ సాత్ సాత్ హై' చిత్రంలో హీరోయిన్గా నటించింది. దాదాపు 26 ఏళ్ల తర్వాత వీరిద్దరు కలవనున్నారు. దీంతో సల్మాన్ ఖాన్, సోనాలి బింద్రే ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
కాగా.. 1999లో సూరజ్ బర్జాత్య దర్శకత్వం వహించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ హమ్ సాత్ సాత్ హై చిత్రంలోలో సోనాలి, సల్మాన్ ఖాన్ జంటగా నటించారు. ఈ చిత్రంలో టబు, సైఫ్ అలీ ఖాన్, కరిష్మా కపూర్, అలోక్ నాథ్, రీమా కీలక పాత్రల్లో నటించారు. మరోవైపు సల్మాన్ ఖాన్ బిగ్బాస్ రియాలిటీ నాలుగో సీజన్ నుంచి హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్ ఆగస్టు 24 నుంచి జియో హాట్‌స్టార్, కలర్స్ టీవీలో స్ట్రీమింగ్ కానుంది.