Beauty: ఈ మూడు పాటిస్తే.. 50 ఏళ్లు వచ్చినా హీరోయిన్‌లా.. అందంగా | Kajol Shares About Secret Behind Her Beautiful Glowing Skin In 40s | Sakshi
Sakshi News home page

Kajol: 48 ఏళ్ల వయసులోనూ ఆకట్టుకునే రూపం.. ఈ మూడు పాటించడం వల్లే అంటున్న కాజోల్‌

Dec 20 2022 4:19 PM | Updated on Dec 20 2022 4:32 PM

Kajol Shares About Secret Behind Her Beautiful Glowing Skin In 40s - Sakshi

Kajol- Beauty Tips: చర్మం మీద అనవసర ప్రయోగాలు చేయొద్దంటోంది బాలీవుడ్‌ బ్యూటీ కాజోల్‌. సహజ పద్ధతిలోనే కాంతులీనే చర్మ సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చని చెబుతోంది.  అమ్మ చెప్పిన చిట్కాలే 48 ఏళ్ల వయసులోనూ తన మోము మెరిసిపోవడానికి కారణం అంటోంది. ‘‘స్కిన్‌ మీద ప్రయోగాలు వద్దని మా అమ్మ (నటి తనూజ)..  నా టీనేజ్‌ టైమ్‌లోనే సీరియస్‌గా వార్నింగ్‌ ఇచ్చింది. 

సో నో ఎక్స్‌పరిమెంట్స్‌.. అన్నీ నేచురల్‌ థింగ్సే. వాటిలో రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల మంచినీళ్లు తాగడం ముఖ్యమైందే కాదు అత్యంత అవసరమైంది కూడా. రెండోది సమతుల ఆహారం. మూడోది కంటినిండా నిద్ర. ఒకవేళ ఎప్పుడైనా రెండోది తప్పుతానేమో కానీ మూడోది అదే నిద్ర విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్‌కాను.


తల్లి, చెల్లితో కాజోల్‌

ఏదిఏమైనా హాయిగా ఆదమరచి నిద్రపోతాను. నిద్ర చెడగొట్టే విషయాలనేవీ క్యారీ చేయను. అవండీ మా అమ్మ నాకు, మా చెల్లి (తనీషా ముఖర్జీ)కి చెప్పిన బ్యూటీ టిప్స్‌!’’ అంటూ బ్యూటీ సీక్రెట్‌ను రివీల్‌ చేసింది కాజోల్‌. ఈ చిట్కాలు పాటిస్తే ఐదు పదుల వయసు దాటినా అందంలో మెరిసిపోవచ్చు అని చెబుతోంది. కాగా కాజోల్‌ నటించిన సలాం వెంకీ సినిమా ఇటీవలే విడుదలైంది.

చదవండి: Allu Arjun Wife Sneha Reddy: చీరకట్టులో కుందనపు బొమ్మలా అల్లు స్నేహారెడ్డి! ఆ సారీ ధర ఎంతంటే!
నోటి నుంచి దుర్వాసన వస్తోందా? నీటిలో తౌడు వేసి.. తెల్లారి పరగడుపున వీటిని కలిపి తాగితే..
                

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement