Fashion: అందానికే అందంలా అల్లు స్నేహారెడ్డి! ఆ చీర ధర ఎంతంటే! | Allu Arjun Wife Sneha Reddy In Label Kshitij Saree Stunning Looks Price Is | Sakshi
Sakshi News home page

Allu Arjun Wife Sneha Reddy: చీరకట్టులో కుందనపు బొమ్మలా అల్లు స్నేహారెడ్డి! ఆ సారీ ధర ఎంతంటే!

Dec 11 2022 1:46 PM | Updated on Dec 11 2022 2:04 PM

Allu Arjun Wife Sneha Reddy In Label Kshitij Saree Stunning Looks Price Is - Sakshi

లేబుల్‌ క్షితిజ్‌ జలోరీ బ్రాండ్‌ సారీలో అల్లు స్నేహారెడ్డి (PC: allusnehareddy Intagram)

Allu Arjun Wife Allu Sneha Reddy- Fashion Brands: ట్రెండ్‌ను ఫాలో అవుతూ స్టైల్‌ మెయింటైన్‌  చేయడంలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ముందుంటారు అన్న విషయం తెలిసిందే. అయితే అలాంటి స్టైలిష్‌ స్టార్‌కు సరిజోడు అనిపించుకుంటోంది అల్లు స్నేహారెడ్డి.

ఫంక్షన్‌ అయినా.. పార్టీ అయినా.. ఔటింగ్‌ అయినా.. తనకు నప్పే అవుట్‌ ఫిట్‌తో సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. అలా తనను ఎలివేట్‌ చేసే లుక్‌ కోసం స్నేహారెడ్డి డిపెండ్‌ అయ్యే ఫ్యాషన్‌ బ్రాండ్స్‌లో ఇవీ ఉన్నాయి..  

లేబుల్‌ క్షితిజ్‌ జలోరీ
క్షితిజ్‌.. న్యూఢిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో టెక్స్‌టైల్‌ కోర్సు పూర్తి చేశాడు. తర్వాత కొంత కాలం వివిధ ప్రాంతాల్లో పర్యటించి దేశ సంస్కృతీసంప్రదాయాలను ప్రేరణగా తీసుకొని 2018లో ‘లేబుల్‌ క్షితిజ్‌ జలోరీ’ని ప్రారంభించాడు.

దేశీ సంప్రదాయ నేత కళ, వరల్డ్‌ ట్రెండ్స్‌ అండ్‌ స్టయిల్స్‌ను పడుగుపేకలుగా పేర్చి డిజైన్స్‌ను క్రియేట్‌ చేస్తున్నాడు. అతివలు నచ్చే.. మెచ్చే చీరలు, దుపట్టాలు, లెహంగాలను డిజైన్‌ చేయడంలో ఈ బ్రాండ్‌కి సాటి లేదు. అయితే వీటి ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి.

ఖన్నా జ్యూయెలర్స్‌
నగల వ్యాపారంలో డెబ్భై ఏళ్లకు పైగా నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న ఈ ఖన్నా జ్యూయెలర్స్‌ను స్వర్గీయ శ్రీ వజీర్‌ చంద్‌ ఖన్నా ప్రారంభించారు.  చిక్, లష్‌ పోల్కిస్‌ – ఫ్యూజన్‌ స్టైల్స్‌ బంగారు ఆభరణాలు ఈ బ్రాండ్‌ ప్రత్యేకత. ప్రస్తుతం ఢిల్లీతోపాటు  చెన్నై, కోయంబత్తూర్‌లలో ఈ జ్యూయెలర్స్‌కి స్టోర్స్‌ ఉన్నాయి. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వీలుంది. ధర.. ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.

బ్రాండ్‌ వాల్యూ 
చీర బ్రాండ్‌: లేబుల్‌ క్షితిజ్‌ జలోరీ
ధర: రూ. 59,800

జ్యూయెలరీ
బ్రాండ్‌: ఖన్నా జ్యూయెలర్స్‌
ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.

అలా ఏం లేదు..
నాకు సపరేట్‌ స్టైల్‌ అంటూ లేదు. అకేషన్‌కి తగ్గట్టు రెడీ అవడమే! – అల్లు స్నేహా రెడ్డి.

-దీపికా కొండి

చదవండి: Bhagyashree: 53 ఏళ్ల వయసులోనూ అందంలో తగ్గేదేలే! నా బ్యూటీ సీక్రెట్‌ అదే!
Varsha Bollamma: ఈ హీరోయిన్‌ ధరించిన డ్రెస్‌ ధర 9500! జైరా బ్రాండ్‌ ప్రత్యేకత అదే! సామాన్యులకు కూడా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement