అదిరిపోయిన కాజోల్‌ లుక్‌..

Tanhaji: The Unsung Warrior, Kajol First Look - Sakshi

చత్రపతి శివాజీ సైన్యాన్ని ముందుండి నడిపించిన మరాఠా వీరుడు తానాజీ మలుసరే జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తాన్హాజీ: ది అన్‌సంగ్‌ వారియర్‌’. ఇందులో మరాఠా యోధుడిగా అజయ్‌ దేవ్‌గన్‌, ఆయన సతీమణి పాత్రలో కాజోల్‌ నటిస్తున్నారు. 2008లో ‘యు మీ ఔర్‌ హమ్‌’ తర్వాత వీళ్లిద్దరి కలయికలో వస్తున్న చిత్రమిది. ఓమ్‌రత్‌ దర్శకత్వం వహిస్తుండగా టీసీరిస్‌తో కలిసి అజయ్‌ దేవ్‌గన్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరాఠా వీరుడి పత్ని సావిత్రిబాయి మలుసరేగా కాజోల్‌ ఫస్ట్‌లుక్‌ను సోమవారం విడుదల చేశారు. మరాఠా మహిళ పాత్రలో ఒదిగిపోయిన కాజోల్‌ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

ఈ సినిమాలో ఉదయ్‌ సింగ్‌ రాథోడ్‌ పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ కనిపించనున్నారు. ఓంకార్‌ చిత్రం తర్వాత అజయ్‌ దేవ్‌గన్‌, సైఫ్‌ అలీఖాన్‌ కలిసి నటిస్తున్న చిత్రమిది. మొదట సినిమా పేరును తానాజీగా ప్రకటించిన  చిత్రబృందం న్యూమరాలజీ ప్రకారం తాన్హాజీగా మార్చింది. ఈ చిత్ర ట్రైలర్‌ను రేపు(నవంబర్‌ 19న) రిలీజ్‌ చేయనున్నారు. కాగా తాన్హాజీ చిత్రంతో అజయ్‌ దేవ్‌గన్‌ సెంచరీ పూర్తి చేసుకోనున్నారు. ఈ చారిత్రాత్మక చిత్రం వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top