టాలీవుడ్‌లో నిర్మాత.. బాలీవుడ్‌లోకి డైరెక్టర్‪‌గా ఎంట్రీ | Sakshi
Sakshi News home page

Charan Tej: టాలీవుడ్‌లో నిర్మాత.. బాలీవుడ్‌లోకి డైరెక్టర్‪‌గా ఎంట్రీ

Published Fri, May 24 2024 5:50 PM

Prabhu Deva And Kajol New Movie After 27 Years

తెలుగులో సినిమాలు నిర్మించిన చరణ్ తేజ్ ఉప్పలపాటి ఇప్పుడు హిందీలో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఓ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్‌ని తీస్తున్నారు. కాజోల్, ప్రభుదేవా లీడ్ రోల్స్ చేస్తున్నారు. నసీరుద్దీన్ షా, సంయుక్త మేనన్, జిషు సేన్ గుప్తా తదితరలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. చరణ్ తేజ్ తెలుగులో 'స్పై', 'మళ్లీ మొదలైంది' సినిమాలని నిర్మించారు. ఇ‍ప్పుడు డైరెక్టర్ అయిపోయారు.

(ఇదీ చదవండి: స్క్రీన్‌పై సమంతతో రొమాంటిక్ సీన్స్.. చైతూ రియాక్షన్ ఏంటంటే?)

ప్రభుదేవా, కాజోల్.. 27 సంవత్సరాల క్రితం 'మెరుపు కలలు' సినిమా చేశారు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ కలిసి పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే అప్డేట్ వదిలారు. ఈ చిత్ర మొదటి షెడ్యూల్ పూర్తయిందని, త్వరలోనే టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ మూవీ కోసం టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. 'జవాన్' సినిమాటోగ్రాఫర్‌ జికె విష్ణు, 'యానిమల్' ఫేమ్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ తదితరలు వర్క్ చేస్తున్నారు.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' పునర్నవి ప్రేమలో పడిందా? మరి ఆ కుర్రాడెవరు?)

Advertisement
 
Advertisement
 
Advertisement