
నాగచైతన్య-సమంత.. టాలీవుడ్‌లో ఈ జోడీకి స్పెషల్ క్రేజ్ ఉంది. కలిసి కెరీర్ మొదలుపెట్టిన వీళ్లిద్దరూ ఆ తర్వాత పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. కానీ ఏమైందో ఏమో గానీ నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఎవరి కెరీర్ పరంగా వాళ్లు బిజీ అయిపోయారు. అలాంటిది ఇప్పుడు మళ్లీ వీళ్లిద్దరి గురించి మాట్లాడుకునేలా చేశారు. ఇంతకీ అసలేం జరిగింది?
(ఇదీ చదవండి: 'బాహుబలి' నిర్మాతల హారర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్)
ప్రేమించి పెళ్లి చేసుకున్న చైతూ-సమంత.. జంటగా నాలుగు సినిమాలు చేశారు. వీటిలో అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి నటించిన 'మనం'లో భార్యభర్తలుగా నటించారు. తాజాగా ఈ మూవీ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రీ రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లోని దేవి థియేటర్‌లో గురువారం సాయంత్రం షో వేయగా.. అక్కినేని ఫ్యామిలీకి చెందిన చైతూ, సుప్రిత తదితరులు హాజరయ్యారు.
ఇక ఈ సినిమాలో తాతతో ఉన్న సీన్స్ చూస్తూ ఎమోషనల్ అయిన చైతూ.. సమంతతో రొమాంటిక్ సన్నివేశాలు వస్తున్నప్పుడు మాత్రం సైలెంట్‌గా ఉండిపోయాడు. కానీ థియేటర్‌లో ఉన్న ఫ్యాన్స్ మాత్రం అరిచి గోల గోల చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: చరణ్-తారక్‌పై మనసు పారేసుకున్న హాలీవుడ్ భామ.. ఏం చెప్పిందంటే?)
#NagaChaitanya reaction for #ChaySam Pelli Scene at #Manam Re Release 💖🔥🔥@Samanthaprabhu2 @chay_akkineni #ManamReRelease#NagaChaitanya#Samantha pic.twitter.com/KYRzcMdbyt
— Ungamma (@ShittyWriters) May 23, 2024