చరణ్-తారక్‌పై మనసు పారేసుకున్న హాలీవుడ్ భామ.. ఏం చెప్పిందంటే? | Anne Hathaway Reveals Her Desire To Work With RRR Movie Actors, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

Anne Hathaway: 'ఆర్ఆర్ఆర్' టీమ్‌తో కలిసి పనిచేయాలనుంది

Published Fri, May 24 2024 2:19 PM

Anne Hathaway Desire To Work With RRR Movie Actors

'ఆర్ఆర్ఆర్' సినిమా వచ్చి రెండేళ్లు దాటిపోయింది. కానీ ఇప్పటికే ఎక్కడో ఓ చోట ఇంకా దీని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. మన సినిమా కాబట్టి మనం మాట్లాడుకోవడంలో వింతేం లేదు. కానీ హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా దీనికి ఫిదా అయిపోయి ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. తాజాగా హాలీవుడ్ బ్యూటీ ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' గురించి మాట్లాడుతూ తన కోరిక బయటపెట్టింది.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' పునర్నవి ప్రేమలో పడిందా? మరి ఆ కుర్రాడెవరు?)

'నేను అందరిలానే 'ఆర్ఆర్ఆర్' సినిమాని ఎంతో ఇష్టపడ్డాను. ఇది అద్భుతంగా ఉంది. ఇందులో నటించిన వాళ్లలో ఎవరితోనైనా కలిసి పనిచేయడం నిజంగానే ఓ డ్రీమ్' అని హాలీవుడ్ నటి  ఆన్‌ హాథవే  చెప్పుకొచ్చింది.

హాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాలైన 'ఇంటర్ స్టెల్లార్', 'ద డార్క్ నైట్ రైజెస్' తదితర సినిమాల్లో నటించిన ఆన్‌ హాథవే ఇప్పుడు 'ద ఐడియా ఆఫ్ యూ' అనే మూవీతో ప్రేక్షకుల్ని పలకరించింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమ్‌ కానుంది. దీని ప్రీమియర్ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 'ఆర్ఆర్ఆర్'పై తాను మనసు పారేసుకున్న విషయాన్ని బయటపెట్టింది. ఆన్‌ కామెంట్స్ బట్టి చూస్తే తారక్, చరణ్‌లతో నటించాలనుకుంటోంది. చూద్దాం మరి ఈ కాంబోని ఎవరైనా సెట్ చేస్తారేమో?

(ఇదీ చదవండి: పిల్లలు వద్దని కండీషన్‌ పెట్టా.. ప్రెగ్నెన్సీ వస్తే రోజూ ఏడుస్తూ..: సీనియర్ నటి కవిత)

Advertisement
 
Advertisement
 
Advertisement