షార్ట్‌ అండ్‌ స్ట్రాంగ్‌!

Kajol And Shruti Haasan Short Film Devi - Sakshi

గాయనిగా, నటిగా, నిర్మాతగా, వ్యాఖ్యాతగా, సంగీత దర్శకురాలిగా తనలోని విభిన్నమైన కోణాలను ప్రేక్షకులకు చూపించారు శ్రుతీహాసన్‌. ఇప్పుడు మరో మీడియమ్‌లోకి అడుగుపెడుతున్నట్టు తెలిసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసిన శ్రుతీహాసన్‌ తాజాగా ఓ షార్ట్‌ ఫిల్మ్‌లో నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ నటీమణులు కాజోల్, నేహా ధూపియా, నీనా కులకర్ణి అలాగే ముక్తా బావ్రే, రామా జోషీ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ప్రియాంకా బెనర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ షార్ట్‌ ఫిల్మ్‌కు ‘దేవి’ అని టైటిల్‌ పెట్టారు. శక్తిమంతమైన సందేశంతో షార్ట్‌ అండ్‌ స్ట్రాంగ్‌గా ఈ షార్ట్‌ ఫిల్మ్‌ రూపొందుతోందని సమాచారం. ‘‘నా తొలి షార్ట్‌ ఫిల్మ్‌ను ఇంత మంది ప్రతిభ కలిగిన నటీమణులతో కలసి చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు శ్రుతీహాసన్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top