వైరలైన కాజోల్‌ మెహందీ ఫంక్షన్‌ ఫొటో! | Kajol Mehandi Function Photo Viral | Sakshi
Sakshi News home page

వైరల్‌గా మారిన కాజోల్‌ మెహందీ ఫంక్షన్‌ ఫొటో!

Apr 25 2020 3:42 PM | Updated on Apr 25 2020 3:47 PM

Kajol Mehandi Function Photo Viral - Sakshi

వైరల్‌గా మారిన కాజోల్‌ మెహందీ ఫొటో!

బాలీవుడ్‌ సీనియర్‌ హీరోయిన్‌ కాజోల్‌ మెహందీ ఫంక్షన్‌కు సంబంధించిన ఓ ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఫొటో వైరలయ్యేంతలా అందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌. 1991లో జరిగిన ఈ మెహందీ ఫంక్షన్‌కు భార్య గౌరీఖాన్‌, కుమారుడ్‌ ఆర్యన్‌లతో కలిసి హాజరయ్యారాయన. కాజోల్‌ చేతికి గోరింటాకుతో సోఫాలో కూర్చుని ఉండగా ఆమె వెనకాల కుమారుడు ఆర్యన్‌తో షారుఖ్‌, అతడి పక్కన గౌరీ ఉన్నారు. కిరణ్‌ ఎస్‌ఆర్‌కే ఫ్యాన్‌ అనే ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాదారుడు ఈ ఫొటోను షేర్‌ చేశాడు. దీంతో ఇరువురి ఫ్యాన్‌క్లబ్‌లకు చెందిన అభిమానులు ఈ ఫొటోను చూసి మురిసి పోతున్నారు. (పది మిలియన్‌ ఫాలోవర్స్‌ క్లబ్‌లో కాజోల్‌)

కాగా, షారుఖ్‌, కాజోల్‌లు కలిసి నటించిన పలు చిత్రాలు ఆల్‌టైం బ్లాక్‌ బ్లాస్టర్లుగా నిలిచిన సంగతి విధితమే. వీరు నటించిన 1995 ‘దిల్‌ వాలే దుల్షేనియా లేజాయేంగే’  ఓ క్లాసిక్‌గా నిలిచిపోయింది. ఈ చిత్రం ముంబైలోని  మరాఠా మందిర్‌ సినిమా హాల్లో ఇప్పటికీ ఆడుతూనే ఉండటం గమనార్హం. వీరు చివరగా కలిసి నటించిన సినిమా రోహిత్‌ శెట్టి ‘దిల్‌వాలే’.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement