పది మిలియన్ ఫాలోవర్స్ క్లబ్‌లో కాజోల్

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. తన సినిమా విషయాలు, భర్త అజయ్ దేవగన్‌తో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటారు. అయితే తాజాగా కాజోల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పది మిలియన్ల ఫాలోవర్స్ మార్క్ చేరుకున్నారు. ఇక దీనిపై స్పందించిన కాజోల్.. ‘వెండితెరపై, సోషల్‌మీడియాలో అభిమానులు చూపిన ప్రేమకు కృతజ్ఞతలు’ అని కామెంట్ చేశారు.
అదే విధంగా 2001లో తను నటించిన ‘కభీ ఖుషీ కభీ గమ్’ చిత్రానికి సంబంధించిన బాంగ్రా డాన్స్ వీడియోను కాజోల్ జత చేశారు. ఆ చిత్రంలో అంజలీ అనే పాత్రలో కాజోల్ నటించిన విషయం తెలిసిందే. చత్రపతి శివాజీ సైన్యాన్ని ముందుండి నడిపించిన మరాఠా వీరుడు తానాజీ మలుసరే జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘తాన్హాజీ: ది అన్‌సంగ్ వారియర్’. ఈ మూవీలో మరాఠా యోధుడిగా నటించిన అజయ్ దేవ్‌గన్‌కి సతీమణి పాత్రలో కాజోల్ నటించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి