హీరోయిన్‌ని డైరెక్ట్‌ చేయనున్న నటి | Kajols Next Film The Last Hurrah Directed By Revathy | Sakshi
Sakshi News home page

Kajol: కాజోల్‌ని డైరెక్ట్‌ చేయనున్న నటి రేవతి

Oct 9 2021 1:46 PM | Updated on Oct 9 2021 2:47 PM

Kajols Next Film The Last Hurrah Directed By Revathy - Sakshi

ఒకప్పటి బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, ఒకప్పటి టాలీవుడ్‌ హీరోయిన్‌ ఇద్దరూ కలిసి ఒకే సినిమాకి పని చేయబోతున్నారు. అయితే అందులో ఒకరు నటిగా చేస్తుండగా, మరొకరు డైరెక్టర్‌గా..

ఒకప్పటి బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, ఒకప్పటి టాలీవుడ్‌ హీరోయిన్‌ ఇద్దరూ కలిసి ఒకే సినిమాకి పని చేయబోతున్నారు. అయితే అందులో ఒకరు నటిగా చేస్తుండగా, మరొకరు డైరెక్టర్‌గా చేయనున్నారు. వారే కాజోల్‌, రేవతి.

ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది కాజోల్‌. రేవతి దర్శకత్వంలో పని చేయనుండడం ఎంతో సంతోషంగా ఉందని నటి తెలిపింది. ఆ సినిమా పేరు ‘ది లాస్ట్‌ హుర్రే’. హృదయానికి హత్తుకునే ఆ సినిమా కథ వినగానే ఓకే చెప్పినట్లు బ్యూటీ చెప్పుకొచ్చింది. అయితే నటి నుంచి దర్శకురాలిగా మారిన రేవతి ఇప్పటికే నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించగా.. ఐదో మూవీని కాజోల్‌ చేయనున్నారు. అయితే ఈ చిత్రాన్ని బీలైవ్‌ ప్రోడక‌్షన్స్‌, టేక్‌ 23 స్టూడియోస్‌ ప్రోడక‌్షన్స్‌ నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

చదవండి: అమితాబ్‌ ముందు కంటతడి పెట్టిన జెనీలియా దంపతులు

Advertisement
 
Advertisement
Advertisement