టాలీవుడ్ డైరెక్టర్‌ భారీ యాక్షన్‌ థ్రిల్లర్.. 27 ఏళ్ల తర్వాత స్క్రీన్‌పై స్టార్‌ జోడీ..! | Sakshi
Sakshi News home page

Kajol and Prabhu Deva: 27 ఏళ్ల తర్వాత తెరపై కాజోల్- ప్రభుదేవా.. టాలీవుడ్ డైరెక్టర్‌ సినిమాతోనే!

Published Fri, May 24 2024 9:17 PM

Kajol and Prabhu Deva to reunite after 27 years in Bollywood Movie

బాలీవుడ్‌ హీరోయిన్‌ కాజోల్, స్టార్ కొరియోగ్రాఫర్‌ ప్రభుదేవా జంటగా నటించిన చిత్రం 'మిన్సార కనవు'. 1997లో వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని రాజీవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతమందించారు. ఈ సినిమా రిలీజై ఇప్పటికీ దాదాపు 27 ఏళ్లు పూర్తవుతోంది.

తాజాగా ఈ జోడీ మళ్లీ తెరపై జంటగా సందడి చేయనుంది. టాలీవుడ్ చిత్రనిర్మాత చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకుడిగా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాను యాక్షన్‌ థ్రిల్లర్‌గా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. దీంతో మళ్లీ 27 ఏళ్ల కాజోల్, ప్రభుదేవా నటించడం సినీ ప్రియుల్లో ఆసక్తి పెంచుతోంది. వీరితో పాటు ఈ చిత్రంలో నసీరుద్దీన్ షా, సంయుక్త మీనన్, జిషు సేన్ గుప్తా, ఆదిత్య సీల్ వంటి స్టార్స్‌ నటిస్తున్నారు.

prabhudeva

మరోవైపు టాలీవుడ్ హీరోయిన్ సంయుక్త మీనన్‌ ఈ మూవీతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనుంది. మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసి.. త్వరలోనే టీజర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement