అగ్రస్థానంలో.. రష్మిక మందన్న: కొడగు జిల్లాలో.. | Rashmika Mandanna Becomes Kodagu No 1 Taxpayer Know The Details Here | Sakshi
Sakshi News home page

అగ్రస్థానంలో.. రష్మిక మందన్న: కొడగు జిల్లాలో..

Jan 7 2026 7:24 PM | Updated on Jan 7 2026 9:27 PM

Rashmika Mandanna Becomes Kodagu No 1 Taxpayer Know The Details Here

నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి దాదాపు చాలామందికి తెలుసు. కానీ ఈమె కొడగు జిల్లాలో అత్యధిక పన్ను చెల్లింపుదారు అనే విషయం బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ ఈ కథనంలో తెలుసుకుందాం.

కొడగు జిల్లాలో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తిగా.. రష్మిక మందన్న సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు త్రైమాసికాలలో రూ.4.69 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించి, జిల్లాలోని మొత్తం పన్ను చెల్లింపుదారులలో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు.

కొడగు జిల్లాలోని విరాజ్‌పేటకు చెందిన రష్మిక.. కన్నడ చిత్రం కిరిక్ పార్టీతో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తరువాత చలో సినిమాతో తెలుగు చిత్ర సీమలో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత గీతగోవిందం సినిమాతో బాగా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ఈమె తమిళం, హిందీ భాషా సినిమాల్లో కూడా నటిస్తూ.. మంచి గుర్తింపు పొందారు.

విజయ్‌ దేవరకొండ, రష్మికల పెళ్లి
హీరో విజయ్‌ దేవరకొండ, హీరో­యిన్‌ రష్మిక మందన్నా నిశ్చితార్థం జరిగిందన వార్తలు వచ్చినప్పటికీ.. వారు మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. కానీ, సరైన సమయంలో ఆ విషయం గురించి చెబుతానని ఇప్పటికే రష్మిక క్లారిటీ ఇచ్చింది. హైదరాబాద్‌లోని విజయ్‌ దేవరకొండ నివాసంలో వీరి ఎంగేజ్‌మెంట్‌ అయిందని వారి సన్నిహితులు కూడా పోస్టులు పెట్టారు. ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. అయితే, ఇప్పుడు పెళ్లి గురించి వార్తలు వస్తున్నాయి.

సోషల్‌ మీడియాలో వస్తున్న తాజా సమాచారం ప్రకారం.. 2026 ఫిబ్రవరి 26న విజయ్‌ - రష్మికల పెళ్లి జరగనుందని తెలుస్తోంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో వారిద్దరూ పెళ్లిపీటలెక్కబోతున్నారని టాక్‌ జరుగుతుంది.  ఘనంగా పెళ్లి జరిపేందుకు  ఇరు కుటుంబ సభ్యులు ఘనంగా ఏర్పాట్లు చేయబోతున్నారని టాక్‌. అయితే,  ఇందులో నిజమెంతో తెలియాలంటే విజయ్‌-రష్మికలో ఎవరో ఒకరు స్పందించాల్సిందే.

ఇదీ చదవండి: మార్చి 2026 నుంచి ఏటీఎమ్‌లో రూ.500 నోట్లు రావా.. నిజమెంత?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement