breaking news
Kodagu
-
పాపులర్ ట్రెక్కింగ్ డెస్టినేషన్ : నిశానబెట్ట గురించి తెలుసా?
బనశంకరి: దట్టమైన అడవులు, ఎత్తైన వృక్షాలు, పచ్చదనం పరుచుకున్న కొండలు, నయన మనోహరమైన సూర్యోదయం, సూర్యాస్తమయ దృశ్యాలతో ఉత్తర కన్నడ జిల్లా శిరసి తాలూకా నిశానబెట్ట (Nishani Betta) పర్యాటకులను రా రమ్మని ఆహ్వానం పలుకుతోంది. ప్రకృతి ప్రేమికులు, పర్వతారోహకులకు నూనెబెట్ట స్వర్గధామంగా మారింది. ఉత్తరకన్నడ నుంచి వానల్లి-కక్క మార్గంలో 25 కిలోమీటర్ల దూరంలో నిశాన బెట్ట ఉంది. ప్రసిద్ధ ట్రెక్కింగ్ గమ్యస్థానం నిశాని బెట్ట, నిశాన మొట్టే అని కూడా పిలుస్తారు, ఇది కర్ణాటకలోని కొడగు (కూర్గ్) జిల్లాలో ఉన్న ఒక శిఖరం. సముద్ర మట్టం నుంచి 783మీటర్ల ఎత్తులో ఉన్న నిశాన బెట్టి ప్రకృతి అందాలతో రంగా ఉంటుంది. లోయలతో కూడిన ఈ కొండపైకి ట్రెక్కింగ్ చేయడం జీవితంలో మరచి పోలేని అనుభవం. గ్రామపంచాయతీ పరిదిలోని వాన నుంచి కక్కళ్లి మార్గంలో 5కిలోమీటర్లు ప్రయాణించాలి. కాలినడకన అరకిలోమీటర్ నడవాలి. కొద్దిదూరం దట్టమైన అడవిలో ప్రయాణించాలి. అడవి దాటగానే తగ్గుప్రదేశం నుంచి ట్రెక్కింగ్ మొదలవుతుంది. ఇది జారుడుగా ఉండటం వల్ల ప్రమాదకరంగా ఉంటుంది. వర్షాకాలంలో ట్రెక్కింగ్ కష్టసాధ్యం. వర్షాకాలం అనంతరం ట్రెక్కింగ్ చేయడం ఉత్తమం. ఆ పేరు ఎలా వచ్చిందంటేయాత్రను గుర్తించడానికి నిశానెబెట్టపై సైనికులు సహారా కాసేవారు. ఎదురుదాడి చేయడానికి సైన్యం వస్తుందని తెలియగానే నిశానెబెట్టపై నుంచి జెండా ఊపి విషయం చేరవేసేవారని, అందుకే ఈ బెట్టకు ని నెబెట అని పేరు వచ్చిందని చెబుతారు. వీకెండ్ సమయంలో పర్యాటకుల సందడి నిశానెబెట్టకు వీకెండ్ సమయంలో పర్యాటకులు, పర్వతారోహకులు పెద్ద సంఖ్యలో వచ్చి ప్రకృతి అం దాలను ఆస్వాదిస్తారు. సూర్యోదయం, సూర్యాస్థ మయం అద్భుతంగా ఉంటుంది. ఈ నయన మనోహర దృశ్యాన్ని కెమెరాల్లో బంధించేందుకు ఫొటోగ్రాఫర్లు పోటీ పడతారు. నిశానెబెట్ట వీక్షణకు వచ్చే వారు పరిసరాల శుభ్రత పాటించాల్సి ఉంటుంది. సోందా అరసరపాలన కాలంలో శత్రువులు దండ తినుబండారాల కవర్లను, ఖాళీ వాటర్ బాటిల్స్ ను ఇష్టారాజ్యంగా పడేయరాదు. నిర్ణీత స్థలంలో ఉంచిన చెత్త బుట్టలో వేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనల వల్లనే నిశానెబెట్ట ప్లాస్టిక్, చెత్త రహితంగా గుర్తింపు పొందింది.సాంస్కృతిక కార్యక్రమాలునినెబెట్ట కేవలం ట్రెక్కింగు కాకుండా సాంస్కృ తిక వైభవానికి వేదికగా మారింది. ఇక్కడ శివరాత్రి జాగరణ నిమిత్తం వైవిధ్యమైన సాంస్కృతిక కార్య క్రమాలు నిర్వహిస్తారు. స్థానికులతో కలిసి ఇక్కడ జాగరణ చేస్తారు. నిశానెబెట్టలో సాంస్కృతిక సంఘాలు నిర్వహించే కార్యక్రమాలు ప్రజాదరణ పొందాయి. నిశాన బెట్ట నైసర్గికంగా దట్టమైన అడవు లతో కూడుకుని ఉండటంతో అంతగా అభివృద్ధి కనబడలేదని స్థానికులు అంటారు.ఇదీ చదవండి: మునుపెన్నడూ ఎరుగని ఉల్లాస యాత్ర : పురాతన ఆలయాలు, సరస్సులు -
‘గూగుల్ తప్పు’.. నమ్మి వెళ్లారో.. అంతే! ఫొటో వైరల్
కొత్త ప్రాంతానికి వెళ్లినప్పుడు గతంలో పేపర్ మ్యాప్‌లను ఉపయోగించడమో లేదా స్థానికులను అడగడం ద్వారానో సరైన దారులను గుర్తించేవారు. అయితే సాంకేతికత పెరిగి యాపిల్ మ్యాప్స్ (Apple Maps), గూగుల్ మ్యాప్స్ (Google Maps) వంటి నావిగేషన్ యాప్‌లు అందుబాటులోకి రావడంతో ఈ ప్రక్రియను సులభతరం చేసింది. అయితే ఎంత లేదన్నా ఈ యాప్‌లు కొన్ని సమయాల్లో అవిశ్వసనీయంగా ఉంటాయి. మార్గాలు, ప్రయాణ ప్రణాళికలను ప్లాన్ చేయడంలో పనికొచ్చేవే అయినప్పటికీ ఒక్కోసారి తప్పుదారి పట్టిస్తుంటాయి. అలాంటి ఒక సంఘటన ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటకలోని కొడగు జిల్లాలో స్థానికులు గూగుల్ నావిగేషన్ పొరపాటు గురించి ప్రయాణికులను హెచ్చరించే తాత్కాలిక సైన్‌బోర్డ్‌ను ఏర్పాటు చేశారు. ఆ ప్రదేశంలో గూగుల్ నావిగేషన్‌ను అనుసరించవద్దని, క్లబ్ మహీంద్రా రిసార్ట్‌కు చేరుకోవడానికి వేరే మార్గంలో వెళ్లాలని సైన్‌బోర్డ్‌లో ప్రయాణికులకు సూచించారు. దీనికి సంబంధించిన ఫొటోను కొడగు కనెక్ట్ అనే పేరుతో ఉన్న ‘ఎక్స్’ (ట్విటర్) హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. “గూగుల్ తప్పు. ఈ రోడ్డు క్లబ్ మహీంద్రాకి వెళ్లదు” అంటూ ఆ సైన్ బోర్డులో ఉంది. ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గూగుల్ నావిగేషన్ తప్పుదారి పట్టించడంతో తాము కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పలువురు యూజర్లు తమ అనుభవాలను పంచుకున్నారు. Somewhere in Kodagu. @GoogleIndia pic.twitter.com/IkSQ9VybW1 — Kodagu Connect (@KodaguConnect) March 14, 2024 -
గజ విషాదం.. మూడు నెలల్లో పది ఏనుగులు మృతి
సాక్షి, బెంగళూరు: ఆహారం కోసం వచ్చిన ఏనుగులు కాఫీతోటల్లో ఏర్పాటు చేసిన కరెంట్ తీగ తగిలి మృతి చెందిన ఘటన కొడగు జిల్లా సిద్దాపుర సమీపంలో చోటుచేసుకుంది. తాలూకాలోని నెల్యహుదికేరి గ్రామానికి చెందిన కాఫీ రైతులు ప్రకాశ్ మందణ్ణ, మండపండ సుమంత్ చెంగప్పలు పంట రక్షణ కోసం తోటల చుట్టూ ఫెన్సింగ్ నిర్మించి కరెంట్ కనెక్షన్ ఇచ్చారు. ఆదివారం రాత్రి ఆహారం కోసం వచ్చిన ఏనుగులు తోటల్లోకి వెళ్లే ప్రయత్నంలో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే రెండు ఏనుగులు మృతి చెందాయి. మగ, ఆడ ఏనుగులుగా గుర్తించారు. ఇలా మూడు నెలల వ్యవధిలో పది ఏనుగులు బలయ్యాయి. -
పుష్కరానికి ఒక్కసారి...కమనీయ దృశ్యం!
సాక్షి, బెంగళూరు: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా కర్ణాటకలో అద్భుతమైన కమనీయ దృశ్యం ఆవిష్కృతమైంది. రాష్ట్రంలో కొడగు జిల్లాలోని మందలపట్టి కొండవద్ద నీలకురింజి పువ్వులు విరగబూశాయి. 12 సంవత్సరాలకు ఒకసారి వికసించే ఈ పువ్వులు విరగబూయడంతో నెటిజన్లు సందడి నెలకొంది. అద్భుతం.. రెండు కళ్లూ చాలవంటూ పులకించిపోతున్నారు. అరుదైన మొక్కల్లో ఒకటి నీలకురింజి. ఇవి పన్నెండేండ్లు పెరిగి పూలు పూసిన తర్వాత చనిపోతాయట. అలా వాటి విత్తనాలతో మొలకెత్తిన మొక్కలు మళ్లీ పూతకు రావాలంటే పుష్కర కాలం వెయిట్ చేయాల్సిందే. సాధారణంగా ప్రతీ ఏడాది జూలై-అక్టోబర్ నెలల కాలంలో ఇవి పూస్తాయి. ఇకవీటికి నీలకురింజి అనే పేరు ఎలా వచ్చిందంటే..మలయాళంలో కురింజి అంటే పువ్వు అని, నీల అంటే నీలిరంగు అని అర్థం. ఈ పుష్పాలు నీలం రంగులో ఉండటం వల్ల ‘నీలకురింజి’ అనే పేరు వచ్చిందట. Karnataka | Neelakurinji flowers, which bloom once every 12 years, seen at Mandalapatti hill in Kodagu district. pic.twitter.com/DgpZaYoFQI — ANI (@ANI) August 18, 2021 -
డేంజర్ జోన్లో 6 జిల్లాలు
బనశంకరి: రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రభుత్వం లాక్డౌన్ విధించినప్పటికీ పెద్ద ప్రయోజనం కనబడడం లేదు. దేశంలోని 52 జిల్లాలు డేంజర్‌జోన్‌లో ఉండగా అక్కడ 100 శాతానికి పైగా కేసుల వృద్ధి నమోదవుతోంది. వాటిలో కర్ణాటకలోని 6 జిల్లాలున్నాయి. ఏప్రిల్ 14 నుంచి ఇప్పటివరకు 52 జిల్లాల్లో విచ్చలవిడిగా కరోనా కేసులు పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గుర్తించింది. అందులో దేశంలోని మహానగరాలను వెనక్కినెట్టి రాష్ట్రంలోని 6 జిల్లాలు ముందువరుసలో నిలిచాయి. కొడగుకు దేశంలోనే 3వ స్థానం.. దేశంలో అత్యధిక కరోనా కేసుల వృద్ధి ఉన్న జిల్లాల్లో 3వ స్థానంలో రాష్ట్రంలోని కాఫీనాడు కొడగు జిల్లా ఉంది. కొడగు 184 శాతం కేసుల వృద్ధిరేటు కలిగి ఉంది. తుమకూరు 146 శాతం, కోలారు 136 శాతం, మండ్య 118 శాతం, రామనగర 102 శాతం, చామరాజనగర 143 శాతం వృద్ధి రేటు కలిగి ఉన్నాయి. ఇక్కడ ఫుల్ లాక్డౌన్ శివాజీనగర: ప్రధాని నరేంద్ర మోదీ సీఎంలతో, కలెక్టర్లతో తాజా సమావేశం తరువాత రాష్ట్రంలో పలు జిల్లాల్లో గురువారం నుంచి సంపూర్ణ లాక్డౌన్ మొదలైంది. కరోనా ప్రభంజనాన్ని అడ్డుకోవడానికి ఇప్పటికే మే 24 వరకు సడలింపులతో లాక్డౌన్ జారీలో ఉంది. కేసులు తీవ్రం కావడంతో ఉమ్మడి బళ్లారి జిల్లా, హాసన్, కల్బుర్గి, కొప్పళ, శివమొగ్గ, చిక్కబళ్లాపుర జిల్లాల్లో 4 రోజుల పాటు కఠిన లాక్డౌన్ అమలు కాబోతోంది. ఈ సమయంలో కిరాణా షాపులు కూడా తెరవనివ్వరు. -
భార్యపై కోపం.. బామ్మర్ది ఇంటికి నిప్పు.. ఆరుగురు సజీవదహనం
సాక్షి, బెంగళూరు: ఓ తాగుబోతు పైశాచికత్వానికి ఆరుగురు బలయ్యారు. ఇంటికి రానన్న భార్యపై కోపంతో.. బావమరిది ఇంటిని తగలబెట్టాడు. దీంతో ముగ్గురు మంటల్లో సజీవదహనమవగా మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతుల్లో నలుగురు చిన్నారులే. కర్ణాటకలోని కొడగు జిల్లా కనూరులో ఈ ఘోరం జరిగింది. కనూరుకు చెందిన బోజ అనే వ్యక్తి మద్యానికి బానిసై భార్య బేబీతో తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం కూడా బోజ తన భార్యతో గొడవపడ్డాడు. భర్త ఆగడాలను భరించలేకపోయిన బేబీ.. కనూరులోనే ఉంటున్న తన సోదరుడు మంజు ఇంటికి పిల్లలతో సహా వెళ్లింది. మద్యం మత్తులో ఉన్న బోజ.. మంజు ఇంటికి వెళ్లి బేబీని రావాలని కోరగా ఆమె ససేమిరా అంది. అప్పటికి వెళ్లిపోయిన బోజ.. మళ్లీ అర్ధరాత్రి దాటిన తర్వాత మంజు ఇంటికి వచ్చాడు. బయట తాళాలు వేసి ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి పారిపోయాడు. ఇంట్లో బోజ కుటుంబసభ్యులు నలుగురు, మంజు కుటుంబానికి చెందిన మరో నలుగురున్నారు. అర్ధరాత్రి కావడంతో అందరూ గాఢనిద్రలో ఉన్నారు. ఇల్లు మొత్తం మంటలు వ్యాపించాయి. బయటికి వెళ్లలేక బేబీ (40), సీత (45), ప్రార్థన (6) మంటల్లోనే కాలిపోయి చనిపోయారు. స్థానికులు అందించిన సమాచారంతో ఘటనాస్థలికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురిని మైసూరులోని కేఆర్ ఆస్పత్రికి తరలించగా.. విశ్వాస్ (3), ప్రకాశ్ (6), విశ్వాస్ (7) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. భాగ్య (40), పాచె (60) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
గే పెళ్లి: కులాన్ని భ్రష్టు పట్టించావ్ కదరా!
బెంగళూరు: అమెరికాలో ఓ గే జంట పెళ్లిపై కర్ణాటకలోని కొడగు జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని కొడవ సామాజిక వర్గానికి చెందిన శరత్ పొన్నప్ప, కాలిఫోర్నియాలో డాక్టర్‌గా పనిచేస్తున్న సందీప్ దోసాంజిని సెప్టెంబర్ 26న వివాహం చేసుకున్నారు. కొందరు మిత్రుల సమక్షంలో కొడవ సంప్రదాయంలో ఈ పెళ్లి వేడుక జరిగింది. కొడవ వేషధారణలో ఉన్న పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విషయం తెలియడంతో శరత్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు ఆ కులస్తులు. అనాదిగా వస్తున్న ఆచారాలను భ్రష్టు పట్టించావని శరత్‌పై మండిపడ్డారు. (చదవండి: వెలుగులోకి వచ్చిన రహస్య బీచ్) ఈ పెళ్లిని ఖండిస్తున్నామని మడికెరి కొడవ సమాజ ప్రెసిడెంట్ కేఎస్ దేవయ్య స్పష్టం చేశారు. తమ కులానికి శరత్ మచ్చ తెచ్చాడని ఆవేదన ఆయన వ్యక్తం చేశారు. ఇలాంటివి సహించబోమని దేవయ్య హెచ్చరించారు. శరత్‌ను కులం నుంచి వెలివేస్తున్నామని అన్నారు. గతంలో ఇలాంటివి ఎప్పుడూ జరగలేదని తెలిపారు. వారి పెళ్లితో తమకు సంబంధం లేదని.. కొడవ వేషాధరణలో వివాహం చేసుకోడం కలచివేస్తోందని చెప్పారు. తమ సంప్రదాయాలను అవమాన పరచవద్దని విజ్ఞప్తి చేశారు. కాగా, కుల పెద్దల ఆగ్రహావేశాలపై స్పందించేందుకు శరత్ ఇంతవరకు స్పందించలేదు. అనుకరించి అవమానిస్తే సహించరు ఇక దుబాయ్‌లో నివాసం ఉంటున్న అతని తల్లిదండ్రులు ఈ విషయంపై మాట్లాడేందుకు నిరాకరించారు. కాగా ప్రపంచవ్యాప్తంగా మూడు లక్షల జనాభా ఉన్న కొడవ కులస్తుల స్వస్థలం కొడగు జిల్లా. వారు ప్రధానంగా కాఫీ తోటలు పండిస్తారు. అడవులు, పర్వతాలు, నదులు, నీటి కాలువల దగ్గర నివాసం ఉంటారు. ప్రత్యేక వేషధారణతో వేడుకలు చేసుకుంటారు. ఇతరులు వాటిని అనుకరించి అవమానిస్తే సహించరు. గతేడాది కొడగు జిల్లాలోని ఓ ఫైవ్‌స్టార్ రిసార్ట్ కొడవ వేషధారణలో సేవలు అందించినందుకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. దీంతో రిసార్ట్ యాజమాన్యం క్షమాపణలు చెప్పి తప్పు సరిదిద్దుకుంది. కొడగులో పుట్టిన కావేరీ నదిని వారు దేవతగా కొలుస్తారు. (చదవండి: శ్రుతిమించిన ‘గే’ ఆగడాలు) -
వరద బీభత్సంలో పెళ్లి బాజా
యశ్వంతపుర (బెంగళూరు): అంతా సవ్యంగా ఉంటే ఈపాటికి ఆ ఇంట బంధు మిత్రులతో పెళ్లి సందడి నెలకొనేది. అయితే అనూహ్యంగా వరద విపత్తు కారణంగా సర్వం కోల్పోయిన ఆ కుటుంబానికి మేమున్నామంటూ అధికారులు దగ్గరుండి పెళ్లి జరిపించిన ఘటన కర్ణాటకలో వరద బాధిత కొడగు జిల్లాలో జరిగింది. మడికెరి తాలూకా మక్కందూరుకు చెందిన మంజుల, కేరళలోని కణ్ణూరు కుతుపరంబుకు చెందిన రాజేష్‌లకు ఈ నెల 26న పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. పెళ్లికి పదిరోజుల ముందుగానే భారీవర్షాలు కొడగు జిల్లాను ముంచెత్తగా మంజుల ఇల్లు నీటమునిగింది. పెళ్లి దుస్తులు, నగదు, బంగారు మొత్తం వరదలో కొట్టుకుపోయాయి. దీంతో ఆ కుటుంబం పునరావాస కేంద్రంలో తలదాచుకుంది. పెళ్లిని వాయిదా వేయాలని అనుకున్నారు. ఇది తెలుసుకున్న మడికెరి లయన్స్‌క్లబ్, సేవా భారతి సభ్యులు వారి పెళ్లి జరిపించడానికి సిద్ధమయ్యారు. మడికెరిలోని ఓంకారేశ్వరి దేవస్థానంలో ఆదివారం అనుకున్న ముహూర్తానికే వైభవంగా పెళ్లి చేసి మంజుల, రాజేష్‌లను ఆశీర్వదించారు. పెళ్లిలో జిల్లా కలెక్టర్ శ్రీవిద్య సహా పలువురు అధికారులు పాల్గొని దీవించారు.