గే పెళ్లి: కులాన్ని భ్రష్టు పట్టించావ్‌‌ కదరా!

Gay Wedding In US In Kodava Traditional Attire Community Angers - Sakshi

గే పెళ్లిపై మండిపడ్డ కుల పెద్దలు

బెంగళూరు: అమెరికాలో ఓ గే జంట పెళ్లిపై కర్ణాటకలోని కొడగు జిల్లా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలోని కొడవ సామాజిక వర్గానికి చెందిన శరత్‌ పొన్నప్ప, కాలిఫోర్నియాలో డాక్టర్‌గా పనిచేస్తున్న సందీప్‌ దోసాంజిని సెప్టెంబర్‌ 26న వివాహం చేసుకున్నారు. కొందరు మిత్రుల సమక్షంలో కొడవ సంప్రదాయంలో ఈ పెళ్లి వేడుక జరిగింది. కొడవ వేషధారణలో ఉన్న పెళ్లి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. విషయం తెలియడంతో శరత్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు ఆ కులస్తులు. అనాదిగా వస్తున్న ఆచారాలను భ్రష్టు పట్టించావని శరత్‌పై మండిపడ్డారు. 
(చదవండి: వెలుగులోకి వచ్చిన రహస్య బీచ్‌)

ఈ  పెళ్లిని ఖండిస్తున్నామని మడికెరి కొడవ సమాజ ప్రెసిడెంట్‌ కేఎస్‌ దేవయ్య స్పష్టం చేశారు. తమ కులానికి శరత్‌ మచ్చ తెచ్చాడని ఆవేదన ఆయన వ్యక్తం చేశారు. ఇలాంటివి సహించబోమని దేవయ్య హెచ్చరించారు. శరత్‌ను కులం నుంచి వెలివేస్తున్నామని అన్నారు. గతంలో ఇలాంటివి ఎప్పుడూ జరగలేదని తెలిపారు. వారి పెళ్లితో తమకు సంబంధం లేదని.. కొడవ వేషాధరణలో వివాహం చేసుకోడం కలచివేస్తోందని చెప్పారు. తమ సంప్రదాయాలను అవమాన పరచవద్దని విజ్ఞప్తి చేశారు. కాగా, కుల పెద్దల ఆగ్రహావేశాలపై స్పందించేందుకు శరత్ ఇంతవరకు స్పందించలేదు. 

అనుకరించి అవమానిస్తే సహించరు
ఇక దుబాయ్‌లో నివాసం ఉంటున్న అతని తల్లిదండ్రులు ఈ విషయంపై మాట్లాడేందుకు నిరాకరించారు. కాగా ప్రపంచవ్యాప్తంగా మూడు లక్షల జనాభా ఉన్న కొడవ కులస్తుల స్వస్థలం కొడగు జిల్లా. వారు ప్రధానంగా కాఫీ తోటలు పండిస్తారు. అడవులు, పర్వతాలు, నదులు, నీటి కాలువల దగ్గర నివాసం ఉంటారు. ప్రత్యేక వేషధారణతో వేడుకలు చేసుకుంటారు. ఇతరులు వాటిని అనుకరించి అవమానిస్తే సహించరు. గతేడాది కొడగు జిల్లాలోని ఓ ఫైవ్‌స్టార్‌ రిసార్ట్‌ కొడవ వేషధారణలో సేవలు అందించినందుకు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. దీంతో రిసార్ట్‌ యాజమాన్యం క్షమాపణలు చెప్పి తప్పు సరిదిద్దుకుంది. కొడగులో పుట్టిన కావేరీ నదిని వారు దేవతగా కొలుస్తారు.
(చదవండి: శ్రుతిమించిన ‘గే’ ఆగడాలు)

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top